Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas0e18da8c-5d21-4b21-add3-8986caa30df7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas0e18da8c-5d21-4b21-add3-8986caa30df7-415x250-IndiaHerald.jpgఅభిమానులకు ఎలా కావాలో ప్రభాస్‌ను అలానే చూపిస్తా.. డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో "రాజా డీలక్స్" పేరుతో ఒక మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మారుతితో సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడని తెలిసి అప్పట్లో ఫ్యాన్స్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో మారుతి ఒక్క హిట్ కూడా కొట్టలేదు. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన రికార్డు కలిగి ఉన్నా రీసెంట్ పెర్ఫార్మన్స్ ప్రకారం అతడితో సినిమా చేయకపోవడమే మంచిది అన్నట్లు ఇప్పటికీ ఫ్యాన్Prabhas{#}krishnam raju;malavika mohanan;maruti;Ishtam;raja;Darsakudu;Prabhas;media;Director;Hero;Audience;Cinemaఅభిమానులకు ఎలా కావాలో ప్రభాస్‌ను అలానే చూపిస్తా.. డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?అభిమానులకు ఎలా కావాలో ప్రభాస్‌ను అలానే చూపిస్తా.. డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Prabhas{#}krishnam raju;malavika mohanan;maruti;Ishtam;raja;Darsakudu;Prabhas;media;Director;Hero;Audience;CinemaSun, 08 Oct 2023 18:09:00 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో "రాజా డీలక్స్" పేరుతో ఒక మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మారుతితో సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడని తెలిసి అప్పట్లో ఫ్యాన్స్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో మారుతి ఒక్క హిట్ కూడా కొట్టలేదు. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన రికార్డు కలిగి ఉన్నా రీసెంట్ పెర్ఫార్మన్స్ ప్రకారం అతడితో సినిమా చేయకపోవడమే మంచిది అన్నట్లు ఇప్పటికీ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు తాను ప్రభాస్ మూవీ చాలా గొప్పగా తీస్తున్నట్లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

"ప్రభాస్ నుంచి త్వరలోనే రానున్న రెండు సినిమాల అప్‌డేట్స్‌ను ఆడియన్స్ ఆశిస్తే సరిపోతుంది. చాలా రోజుల తర్వాత వచ్చే రాజా డీలక్స్ వంటి సినిమాల గురించి ఇప్పుడే అడగటం అవసరం లేదు. టైం వచ్చినప్పుడు మీరు అడగకముందే అప్‌డేట్ ఇస్తాం." అన్నట్లు మారుతి తాజాగా మాట్లాడాడు. "అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే నా సినిమాలో ప్రభాస్ ని చూపిస్తా. నా హీరో ఎలా ఉంటాడో వారికి ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఆల్రెడీ లీకైన లుక్ చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. వచ్చే నెల నుంచి మిగిలిన షూటింగ్ ప్రారంభమవుతుంది." అని మారుతి చెప్పుకొచ్చాడు.

తన కెరీర్‌లో ప్రభాస్ వంటి పెద్ద స్టార్‌తో సినిమా తీయడం ఇదే తొలిసారి అని, ఇంత మంచి అవకాశాన్ని వేస్ట్ చేయకుండా ప్రభాస్‌ మూవీ కోసం చెమట, రక్తం, కన్నీళ్లను ధారపోస్తున్నానని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో తన కెరీర్‌ ఒక పెద్ద మలుపు తిరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. మొత్తం ఫోకస్ ఈ సినిమా మీదే పెట్టానని, ప్రభాస్ మాత్రం వేరే బిగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడని వెల్లడించాడు. ఇలాంటి సమయంలో రాజా డీలక్స్ నుంచి అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను గందరగోళం లో పడేయడం తనకి ఇష్టం లేదని కూడా అన్నాడు.

ఇకపోతే ప్రభాస్-మారుతి కాంబో మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మిగతా పార్ట్ త్వరలోనే ముగించే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వీలైనంత త్వరగా తీసుకురావాలని కూడా ప్రభాస్ యోచిస్తున్నాడట అంతేకాదు మారుతితో సహకరిస్తున్నాడట. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుండగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>