Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanf00ea37c-f4de-44c1-98dc-aca67f456bfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanf00ea37c-f4de-44c1-98dc-aca67f456bfa-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న బడా ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారక రామారావు నందమూరి ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ఇమేజ్ ని క్రియేట్ చేశారు. ఇక ఇమేజ్ ని వాడుకొని ఎంతోమంది హీరోలు టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా మారారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం.. ఇలాంటి భారీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినవాడు అన్న విషయం తెలిసిKalyan{#}kalyan ram;NTR;Audience;Jr NTR;Tollywood;Telugu;Blockbuster hit;Cinemaనందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. తారక్ లాగా కళ్యాణ్ రామ్ ఎందుకు ఎదగలేదు?నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. తారక్ లాగా కళ్యాణ్ రామ్ ఎందుకు ఎదగలేదు?Kalyan{#}kalyan ram;NTR;Audience;Jr NTR;Tollywood;Telugu;Blockbuster hit;CinemaSun, 08 Oct 2023 09:35:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న బడా ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారక రామారావు నందమూరి ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ఇమేజ్ ని క్రియేట్ చేశారు. ఇక ఇమేజ్ ని వాడుకొని ఎంతోమంది హీరోలు టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా మారారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం.. ఇలాంటి భారీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినవాడు అన్న విషయం తెలిసిందే. అయితే తారక్ ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నందమూరి వారసుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగితే.. అదే నందమూరి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తారక్ అన్న కళ్యాణ్ రామ్ మాత్రం స్టార్ హీరోగా మారలేకపోయాడు.



 త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా తారక్ గ్లోబల్ స్టార్ గా మారితే కళ్యాణ్ రామ్ మాత్రం ఇంకా టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇలా నందమూరి అనే భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ కళ్యాణ్ రామ్ భారీ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఎన్టీఆర్ చూడాలని ఉంది అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఎన్టీఆర్ నటనకు డాన్స్ కి డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు.


 అయితే నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం కెరియర్ ప్రారంభంలోనే కథలు ఎంపిక విషయంలో తడబడ్డాడు. దీంతో వరుస ఫ్లాప్స్ చూశాడు. ఇక మరోవైపు తారక్ ఏకంగా ఎన్టీఆర్ పోలికలతో ఉన్నాడు. ఎన్టీఆర్ చరిష్మా వచ్చింది అంటూ అందరూ పొగడ్తలు కురిపించడంతో.. తెలుగు ప్రేక్షకుల అందరి చూపు కూడా తారక్ వైపు మళ్ళింది. కళ్యాణ్ రామ్ విషయంలో అలా జరగలేదు. ఎన్టీఆర్ కేవలం సినిమాల్లో నటించడం మీద ఫోకస్ పెడితే కళ్యాణ్రామ్ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించడం పైన కూడా దృష్టి పెట్టాడు. దీంతో నటనపై కథల ఎంపికపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాడు. ఎన్టీఆర్ కలుపుగోలు మనిషి ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు. మంచి మాటకారి కూడా. కానీ కళ్యాణ్ రామ్ సైలెంట్. పెద్దగా మాట్లాడడు. ఇలాంటివన్నీ కలిపి ఇక కళ్యాణ్ రామ్ కి స్టార్ స్టేటస్ రాకపోవడానికి కారణాలు ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>