Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyoodaf89573e-a2f5-46c4-9d7a-1399d9124b37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyoodaf89573e-a2f5-46c4-9d7a-1399d9124b37-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే మొన్నటికి మొన్న భారీ అంచనాలతో వచ్చిన భోలా శంకర్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా చిరు పరువు మొత్తం తీసేసింది. అయితే ఇక ఈ ఫ్లాప్ బాధలో ఉండకుండా ఇక ఇప్పుడు చిరంజీవి Tollwyood{#}krishna;shankar;kalyan krishna;Father;Darsakudu;Box office;Director;News;Chiranjeevi;Cinemaకూతురిని సైడ్ చేసిన చిరు.. తండ్రి మీద కోపంతో సుస్మిత?కూతురిని సైడ్ చేసిన చిరు.. తండ్రి మీద కోపంతో సుస్మిత?Tollwyood{#}krishna;shankar;kalyan krishna;Father;Darsakudu;Box office;Director;News;Chiranjeevi;CinemaSun, 08 Oct 2023 15:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే మొన్నటికి మొన్న భారీ అంచనాలతో వచ్చిన భోలా శంకర్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా చిరు పరువు మొత్తం తీసేసింది. అయితే ఇక ఈ ఫ్లాప్ బాధలో ఉండకుండా ఇక ఇప్పుడు చిరంజీవి మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసారు.


 ఇందులో ఒక మూవీకి చిరంజీవి కుమార్తె కొనిదల సుష్మిత నిర్మాతగా వ్యవహరిస్తుంది అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వచ్చాయి. చిరు కూడా స్వయంగా తన నోటితో ఈ మాట చెప్పారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. అయితే మరో మూవీ యూవి క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసార దర్శకుడు వశిష్టత తెరకేక్కించే మూవీ ఉంది అని చెప్పాలి. ఈ రెండు సినిమాలలో ముందుగా సుస్మిత నిర్మిస్తున్న సినిమా అనే పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఈ సినిమా కథ ఇతర పనుల కోసం ఆఫీస్ కూడా ఓపెన్ చేయకుండానే కోటిన్నర ఖర్చుపెట్టినట్లు టాక్.


 అదే సమయంలో ఇక ఇప్పుడు ముందు అనుకున్న కథను కూడా పక్కన పెట్టేసారట. ఈలోగా చిరంజీవి మోకాలు శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. దీంతో దాదాపు రెండు మూడు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే బోలా శంకర్ సినిమా చిరంజీవి మార్కెట్ ను దెబ్బ కొట్టింది. ఇక ఇప్పుడు తర్వాత సినిమా సుస్మితతో చేస్తే రిస్క్ అవుతుందని చిరంజీవి భావిస్తున్నారట. సుస్మిత తండ్రి చిరంజీవి మీద 100 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్న.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరీ అంత పేరు ఉన్న డైరెక్టర్ కాకపోవడంతో చిరు సుస్మిత ప్రాజెక్టును పక్కన పెట్టేసి ముందు వశిష్ట సినిమాలో లైన్లో పెట్టారట. పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే చిరు ఇలా చేయడం సుస్మితకు అస్సలు నచ్చలేదట. తన ప్రయత్నాన్ని తండ్రి నుండి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతుండడంతో సుస్మిత తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి తమిళ ప్రేక్షకులు ఫిదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>