MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-sreenucc87c9a6-0cf0-41b5-a7eb-f07195ed7759-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-sreenucc87c9a6-0cf0-41b5-a7eb-f07195ed7759-415x250-IndiaHerald.jpgపక్కా ఊర మాస్ యాక్షన్ సినిమాలను తెరపైకి తీసుకురావడంలో బోయపాటి శ్రీను మేకింగ్ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను బోయపాటి ఎలా హైలైట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ సౌత్ ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. బోయపాటి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.బోయపాటితో సినిమా చేయడానికి పలువురు హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ డేట్స్ కుదరకపోవడం వలన కొత్త కాంబినేషన్స్ అనేవి సెట్ కాBoyapati Sreenu{#}Geetha Arts;Sarrainodu;geetha;surya sivakumar;Allu Arjun;boyapati srinu;Mass;Blockbuster hit;Tamil;News;mahesh babu;Cinemaనెక్స్ట్ పెద్ద స్టార్స్ తో బోయపాటి సినిమాలు.. ఇవే?నెక్స్ట్ పెద్ద స్టార్స్ తో బోయపాటి సినిమాలు.. ఇవే?Boyapati Sreenu{#}Geetha Arts;Sarrainodu;geetha;surya sivakumar;Allu Arjun;boyapati srinu;Mass;Blockbuster hit;Tamil;News;mahesh babu;CinemaSun, 08 Oct 2023 17:47:00 GMTపక్కా ఊర మాస్ యాక్షన్ సినిమాలను తెరపైకి తీసుకురావడంలో బోయపాటి శ్రీను మేకింగ్ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను బోయపాటి ఎలా హైలైట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ సౌత్ ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. బోయపాటి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.బోయపాటితో సినిమా చేయడానికి  పలువురు హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ డేట్స్ కుదరకపోవడం వలన కొత్త కాంబినేషన్స్ అనేవి సెట్ కావడం లేదు. ఇక రీసెంట్గా స్కంద సినిమాతో వచ్చిన బోయపాటి తరువాత ప్రాజెక్ట్ కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన లైన్ అప్ లో ఉన్న సినిమాల వివరాల్లోకి వెళితే.. గీతా ఆర్ట్స్ లోనే రెండు సినిమాలకు కమిట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.


అల్లు అర్జున్తో గతంలో సరైనోడు సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బోయపాటి ఆ తర్వాత మరో సినిమాను గీత ఆర్ట్స్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అందులో ఒకటి అల్లు అర్జున్ తో ఉండగా మరొకటి తమిళ హీరో సూర్యాతో  చేయాల్సి ఉంది..సూర్య కూడా బోయపాటి కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ కాంబినేషన్స్ గురించి కూడా త్వరలోనే మరో అధికారిక ప్రకటన రానుంది.  అఖండ సీక్వెల్ అయ్యాక బన్నీ, సూర్య సినిమాలు చేయనున్నాడు.ఇంకా అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా బోయపాటి చేయబోతున్నట్లు చాలాసార్లు కథనాలు వెలుపడ్డాయి. అయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎప్పటి నుంచో సినిమా చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల ఈ కాంబినేషన్ సెట్ కావడం లేదు. కానీ తప్పకుండా మహేష్ బాబుతో  భవిష్యత్తులో ఒక ప్రాజెక్టు ఉంటుందని బోయపాటి తెలియజేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>