LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health46d585bf-74cf-4b7f-b390-9b93b4a96c0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health46d585bf-74cf-4b7f-b390-9b93b4a96c0d-415x250-IndiaHerald.jpgకొబ్బరి నీళ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొబ్బరి నీళ్లల్లో చాలా రకాల పోషకాలు, విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి.వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీటిని తాగడం వల్ల నీరసం కూడా తగ్గుతుంది. ఇంకా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మూత్ర మలవిసర్జనలు సాఫీగHEALTH{#}Potassium;Vitamin;Dehydration;Shakti;Manamకొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే?కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే?HEALTH{#}Potassium;Vitamin;Dehydration;Shakti;ManamSat, 07 Oct 2023 22:53:00 GMTకొబ్బరి నీళ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొబ్బరి నీళ్లల్లో చాలా రకాల పోషకాలు, విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి.వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీటిని తాగడం వల్ల నీరసం కూడా తగ్గుతుంది. ఇంకా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మం  ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మూత్ర మలవిసర్జనలు సాఫీగా సాగుతాయి. ఈ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరం బాగా శుభ్రపడుతుంది.ఇంకా శరీరంలో ఉండే మలినాలు విష పదార్థాలు తొలిగిపోతాయి. ఇలా చాలా రకాలుగా కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికి వీటిని వల్ల మనం ఒక్కోసారి చిన్న చిన్న దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల విరోచనాలు ఇంకా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా అలాగే ఈ నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇంకా అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు, వాటికి సంబంధించిన మందులు వాడే వారు కొబ్బరి నీటిని తాగే ముందు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించి తీసుకోవడం మంచిది.ఈ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కొందరిలో అలర్జీ కూడా రావచ్చు. చర్మంపై దురద, దద్దుర్లు ఇంకా వాపు వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.అలాగే మూత్రపిండాల్లో రాళ్లతో పాటు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు కూడా ఈ నీటిని తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించడం కూడా చాలా అవసరం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాటర్ ఫాల్స్ లో తడిసిన అందాలతో అమలాపాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>