MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-mahesh-babu3e6152f3-5342-4a20-b6ed-44cf9b53ce5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-mahesh-babu3e6152f3-5342-4a20-b6ed-44cf9b53ce5b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలు అంటే నరాలు కట్ అయ్యే అంత యాక్షన్ ఘట్టాలు ఉంటాయనడం లో సందేహం లేదు. ఎలాంటి హీరో అయినా సరే బోయపాటి సినిమాలో నటించారు అంటే కచ్చితంగా వారి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. హీరోలు, విలన్ లపై విరుచుకు పడడం కూడా బోయపాటి చాలా క్రూరంగా ప్రెసెంట్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు కూడా అంతే రేంజ్ లో హిట్ అవుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా బోయపాటి తెరకెక్కించిన స్కంద సినిమా కూడాBOYAPATI;MAHESH BABU{#}CBN;Mass;mahesh babu;boyapati srinu;Chitram;Hero;Cinemaమహేష్ బాబు పై అలాంటి కామెంట్స్ చేసిన బోయపాటి..!మహేష్ బాబు పై అలాంటి కామెంట్స్ చేసిన బోయపాటి..!BOYAPATI;MAHESH BABU{#}CBN;Mass;mahesh babu;boyapati srinu;Chitram;Hero;CinemaSat, 07 Oct 2023 14:00:44 GMTప్రస్తుతం మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలు అంటే నరాలు కట్ అయ్యే అంత యాక్షన్ ఘట్టాలు ఉంటాయనడం లో సందేహం లేదు. ఎలాంటి హీరో అయినా సరే బోయపాటి సినిమాలో నటించారు అంటే కచ్చితంగా వారి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. హీరోలు, విలన్ లపై విరుచుకు పడడం కూడా బోయపాటి చాలా క్రూరంగా ప్రెసెంట్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు కూడా అంతే రేంజ్ లో హిట్ అవుతూ ఉంటాయి.

ఇకపోతే తాజాగా బోయపాటి తెరకెక్కించిన స్కంద సినిమా కూడా పరవాలేదు అనిపించేంత గా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే ఇదే సమయంలో ఒకే తరహా చిత్రాలు చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది అని చెప్పవచ్చు. వాస్తవానికి బోయపాటి ఎక్కువగా బాలయ్యతో సినిమాలు చేస్తున్నారే కానీ ఇతర స్టార్ హీరోలతో సినిమాలు చేయడం లేదు.  అయితే ఇలా ఈ వార్త బయటకు రాగానే వెంటనే మహేష్ బాబు ప్రస్తావన వచ్చింది . దీని గురించి బోయపాటి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తాను అని ఆయన తెలిపారు.

అయితే గతంలో కూడా మహేష్ బాబుకి కథ చెప్పడం జరిగిందని. ఆ సమయంలో ఆయన ఒక డౌట్ అడిగారట.. బోయపాటి గారు ఇది మీ హై మీటర్లో ఉండదు కదా అని అడిగారట. దానికి నేను లేదు బాబు అన్నీ పక్కాగా ప్రిపేర్ చేశాను. మీరు నాతో ఒకసారి వర్క్ చేయండి మీకే అర్థమవుతుంది అని చెప్పాను. అప్పుడు ఓకే అనుకున్నాము కానీ ఆయన చేస్తున్న చిత్రం పూర్తయ్యేలోపు నేను వేరే సినిమా మొదలు పెడుతున్నాను. అందుకే మా ఇద్దరి మధ్య ఒక టైం కుదరడం లేదు. కచ్చితంగా టైం కుదిరినప్పుడు సినిమా చేస్తాము అంటూ తెలిపారు. అలాగే మహేష్ బాబు మాస్ , క్లాస్ ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే చేయగలరు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు బోయపాటి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బాబు పై అలాంటి కామెంట్స్ చేసిన బోయపాటి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>