Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket01a729db-a32a-42f2-9518-b5032946df42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket01a729db-a32a-42f2-9518-b5032946df42-415x250-IndiaHerald.jpgసాధారణంగా దేశవాలి క్రికెట్ లో అదరగొడుతున్న ప్రతి ప్లేయర్ కూడా అటు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇలా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టేందుకు అవకాశం వస్తే ఇక క్రికెటర్ల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారైనా దేశం తరఫున వరల్డ్ కప్ జట్టులో చాన్స్ ఇస్తే బాగుంటుంది అని క్రికెటర్లు ఆశపడటం సర్వCricket{#}sunil;Manam;INTERNATIONAL;World Cup;India;Cricketఅన్ లక్కీయేస్ట్ క్రికెటర్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ జట్టులో చోటు.. కానీ?అన్ లక్కీయేస్ట్ క్రికెటర్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ జట్టులో చోటు.. కానీ?Cricket{#}sunil;Manam;INTERNATIONAL;World Cup;India;CricketSat, 07 Oct 2023 11:00:00 GMTసాధారణంగా దేశవాలి క్రికెట్ లో అదరగొడుతున్న  ప్రతి ప్లేయర్ కూడా అటు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇలా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టేందుకు అవకాశం వస్తే ఇక క్రికెటర్ల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారైనా దేశం తరఫున వరల్డ్ కప్ జట్టులో చాన్స్ ఇస్తే బాగుంటుంది అని క్రికెటర్లు ఆశపడటం సర్వసాధారణం.


 అయితే ఇక వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైనప్పటికీ ఇక తుది జట్టులో చోటు తగ్గకపోయినా బెంచ్ స్ట్రెంత్ కి పరిమితమైన కూడా ఇక వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు అనే పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది అని చెప్పాలి  అయితే వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదించుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటి ప్రతిభ ఏంటో నిరూపించుకున్నప్పుడు మాత్రమే వరల్డ్ క్రికెట్ జట్టులో చోటు దక్కుతూ ఉంటుంది  అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం మోస్ట్ అన్ లక్కీఎస్డ్ క్రికెటర్ అని చెప్పాలి.


 అతను ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకముందే ఏకంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా వరల్డ్ కప్ జట్టులో చోటు అంటే మామూలు విషయమా. అతను అదృష్టవంతుడే కదా అంటారా. కానీ కాదు. అతని పేరు సునీల్ వాల్సన్ 1983 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. విషయం ఏమిటంటే.. ఆయన వరల్డ్ కప్ కి ముందు ఇండియా జట్టులో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ వరల్డ్ కప్ కి ఎంపిక అయ్యాడు. అయితే వరల్డ్ కప్ లో కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ఇక ఆ తర్వాత ఇండియా జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. ఇక అతని కెరియర్ మొత్తం ఫస్ట్ క్లాస్ క్రికెట్ తోనే సరిపోయింది. 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 212 వికెట్లు తీసిన వాల్సన్ 1988లో రిటైర్ అయ్యాడు. ఈయన సికింద్రాబాద్కు చెందిన క్రికెటర్ కావడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>