PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mahadev5f4ed86c-43bb-4ec2-83e2-16ac4f7a8c50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mahadev5f4ed86c-43bb-4ec2-83e2-16ac4f7a8c50-415x250-IndiaHerald.jpgమహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు బాలీవుడ్ నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ప్రముఖ బాలీవుడ్ నటీనటులు రణ్ బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనాఖాన్ లను విచారణ కు హాజరు కావాలని నోటీసులు పంపింది. రాయ్ పుర్ లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహదేవ్ బెట్టింగ్ ని సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రమోట్ చేసి దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారు. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పోకMAHADEV{#}Application;ravi anchor;bollywood;Dubai;Cinemaయాడ్స్ చేసే హీరోలకు షాక్‌ ఇచ్చిన ఈడీ?యాడ్స్ చేసే హీరోలకు షాక్‌ ఇచ్చిన ఈడీ?MAHADEV{#}Application;ravi anchor;bollywood;Dubai;CinemaSat, 07 Oct 2023 22:46:00 GMTమహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు బాలీవుడ్ నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ప్రముఖ బాలీవుడ్ నటీనటులు రణ్ బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనాఖాన్ లను విచారణ కు హాజరు కావాలని నోటీసులు పంపింది. రాయ్ పుర్ లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


మహదేవ్ బెట్టింగ్ ని సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రమోట్ చేసి దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారు. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పోకర్, కార్డు గేములతో పాటు వివిధ లైవ్ అక్రమ బెట్టింగ్ లను ఇది ప్రోత్సహించింది. కొత్త వినియోగదారులను చేర్చుకోవడానికి, ఐడీలను సృష్టించడానికి  బినామీ బ్యాంకు ఖాతాలు లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండర్ చేయడానికి ఆన్ లైన్ బెట్టింగ్ అప్లికేషన్ ను ఉపయోగిస్తోందని ఈడీ ఆరోపిస్తోంది.


బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆఫ్షోర్ ఖాతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలపాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా కంపెనీ దాదాపు రూ.5వేల కోట్లు సంపాదించింది అని ఆరోపించింది.  ఈ యాప్ ను బాలీవుడ్ నటులు ఆన్లైన్ లో ప్రచారం నిర్వహించి ప్రమోటర్ల ద్వారా భారీ ఎత్తుగా డబ్బులు అందుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో 15 మంది సెలబ్రెటీలు, నటుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది.


అయితే సినిమా హీరోలు ఇక నుంచి జాగ్రత్త పడాలి. ఎందుకంటే వారు ప్రకటనలో నటించేందుకు తీసుకునే మొత్తం డబ్బును వైట్ మనీగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అలా కాకుండా ప్రమోటర్ల నుంచి ఇలా బ్లాక్ మనీ తీసుకుంటే ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. తద్వారా చిక్కుల్లో పడతారు. ఇకనైనా సినిమా హీరోలు యాడ్స్ కు సైన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాటర్ ఫాల్స్ లో తడిసిన అందాలతో అమలాపాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>