EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/votes1876409a-71b3-4248-b60b-e6d63d104be7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/votes1876409a-71b3-4248-b60b-e6d63d104be7-415x250-IndiaHerald.jpgరాజకీయాలు నానాటికి దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు ఎంతో హుందాగా, రాజకీయ భాషనే వాడుతూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేవారు. వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపే వారు తప్ప, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడం.. నిరాధార ఆరోపణలు చేయడం వంటివి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ.. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన వీరే.. చిల్లర పనులు చేస్తూ వీరి స్థాయిని దిగజార్చుకుంటున్నVOTES{#}prabhakar;tuesday;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Ishtam;Mass;Siddipet;MP;local language;Prime Minister;CM;Party;Minister;Bharatiya Janata Partyఓట్ల సమయంలో వీరావేశాలు.. జనం జాగ్రత్త?ఓట్ల సమయంలో వీరావేశాలు.. జనం జాగ్రత్త?VOTES{#}prabhakar;tuesday;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Ishtam;Mass;Siddipet;MP;local language;Prime Minister;CM;Party;Minister;Bharatiya Janata PartySat, 07 Oct 2023 08:00:00 GMTరాజకీయాలు నానాటికి దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు ఎంతో హుందాగా, రాజకీయ భాషనే వాడుతూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేవారు. వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపే వారు తప్ప, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడం.. నిరాధార ఆరోపణలు చేయడం వంటివి చేస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ.. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన వీరే.. చిల్లర పనులు చేస్తూ వీరి స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయం మరిచిపోయి .. ఒక బాధ్యాతాయుత స్థానంలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అభాసుపాలవుతున్నారు.
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కు తొలి రైలు ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. మంగళవారం ఈ రెలును సిద్ధిపేట స్టేషన్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు సిద్దిపేట  మనోహరాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రధాని నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.


అయితే వీటిని మేమంటే మేమే తెచ్చాం అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం.. భారతీయ రైల్వే వ్యవస్థ కేంద్రానిది. దీనికి సంబంధించిన పనుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు ఆ ప్రాంత ఎంపీలను, సీఎంలను పిలుస్తారు. లోకల్ ఎమ్మెల్యే, మంత్రులను పిలవరు. అయితే అక్కడికి వచ్చిన మంత్రి హరీశ్రావు ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ ఫొటో పెట్టలేదని నానా హంగామా సృష్టించారు.


అంతేకాదు అక్కడ ప్రధాని ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరను కాలితో తన్ని అక్కడి నుంచి తీసివేయించారు. ఇది ఆయన స్థాయికి తగిని పని కాదని ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో మాస్ ముద్ర పడొచ్చు కానీ తటస్థుల వద్ద క్లాస్ గా ఎదగాల్సిన సమయంలో చేతులు కాల్చుకున్నారేమో అనిపిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>