EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu5d3c7ea7-a0f6-4936-a70b-b88ad57ccf2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu5d3c7ea7-a0f6-4936-a70b-b88ad57ccf2f-415x250-IndiaHerald.jpgస్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చంద్రబాబు ను విడిపించేందుకు అతని తరఫు లాయర్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తొలుత క్వాష్ పిటిషన్, ఆ తర్వాత బెయిల్ అని ఇలా తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసంతా 17 ఏ చుట్టూనే తిరుగుతుంది. ఆది నుంచి ఈ కేసంతా టెక్నికల్ అంశాల చుట్టూనే తిరుగుతుంది. వీటి చుట్టూనే వాదనలు వినిపించి చంద్రబాబు ని నిర్దోషిగా తీసుకురావాలని అతని న్యాయవాదులు చూస్తున్నారు. సుప్రీం కోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణలో సైతం 17 ఏ వాదనలు వింటామని అత్యున్నత నCHANDRABABU{#}High court;Yaswanth Sinha;court;Lawyer;CBN;AdiNarayanaReddy;Andhra Pradesh;vishwa;Governorదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చంద్రబాబు కేసు?దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చంద్రబాబు కేసు?CHANDRABABU{#}High court;Yaswanth Sinha;court;Lawyer;CBN;AdiNarayanaReddy;Andhra Pradesh;vishwa;GovernorSat, 07 Oct 2023 06:00:00 GMTస్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చంద్రబాబు ను విడిపించేందుకు అతని తరఫు లాయర్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.  తొలుత క్వాష్ పిటిషన్, ఆ తర్వాత బెయిల్ అని ఇలా తమ వంతు కృషి చేస్తున్నారు.  అయితే ఇప్పుడు ఈ  కేసంతా  17 ఏ చుట్టూనే తిరుగుతుంది.  ఆది నుంచి ఈ కేసంతా టెక్నికల్ అంశాల చుట్టూనే తిరుగుతుంది. వీటి చుట్టూనే వాదనలు వినిపించి చంద్రబాబు ని నిర్దోషిగా తీసుకురావాలని అతని న్యాయవాదులు చూస్తున్నారు.  


సుప్రీం కోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణలో సైతం 17 ఏ వాదనలు వింటామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో  అంతటా 17ఏ గురించే చర్చ జరుగుతుంది. గతంలో యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను చంద్రబాబు తరఫు లాయర్లు ఉదహరించారు. 2018 తర్వాత నమోదైన ప్రతి కేసులో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని వాదిస్తున్నారు. అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటున్నారు.


దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు కొనసాగిస్తూ చంద్రబాబు విషయంలో 17 ఏ వర్తించదని.. ఈ కేసులో అవినీతి 2018 కంటే ముందే జరిగిందన్నారు.  విచారణ కూడా అప్పుడే ప్రారంభమైందని… ముందే జరిగిన నేరానికి తర్వాత వచ్చిన సెక్షన్ ఎలా వర్తింపజేస్తారన్నారు.


వీరి వాదనలు విన్న కోర్టు రెండు అంశాలను టచ్ చేసింది. 2018 కంటే ముందే విచారణ ప్రారంభమైందనే దానికి ఆధారాలు సమర్పించాలని కోరింది. వాటిని పరిశీలించి ఈ కేసుకు 17 ఏ వర్తిస్తుందని చెప్తుందా.. లేక ఈ కేసులో మిగతా అంశాల గురించి వాదనలు వినమని కోర్టు ముందే చెప్పింది. అప్పుడే విచారణకు ఆదేశించారు కాబట్టి దానిని కొనసాగిస్తూ  ఆయన్ను మినహాయించి జైలు నుంచి విడుదల చేస్తారా అనేది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>