PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balayya-tdp-telangana73d36cf3-5795-4fb3-ba68-6955065f3699-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balayya-tdp-telangana73d36cf3-5795-4fb3-ba68-6955065f3699-415x250-IndiaHerald.jpgఇలాంటి పార్టీకి బాలయ్య పూర్వవైభవం తీసుకొస్తానని చెబితే ఎవరైనా నమ్ముతారా ? అసలు బాలయ్యవల్ల ఏమవుతుందో ఎవరకీ అర్ధంకావటంలేదు. చేతిలో కాగితం లేకుండా ఒక్క నిముషం కూడా బాలయ్య గట్టిగా మాట్లాడలేరు. పదేళ్ళుగా హిందుపురం ఎంఎల్ఏగా ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో, నియోజకవర్గంలో బాలయ్య కనబడేది అంతంతమాత్రమే. మొదటినుండి బాలయ్యది పార్టీలో గెస్ట్ రోల్ మాత్రమే. ఇపుడు చంద్రబాబు అరెస్టయి జైలులో కూర్చోగానే పార్టీని ముందుండి నడిపిస్తానని బాలయ్య ప్రకటించారు. balayya tdp telangana{#}CBN;Balakrishna;Andhra Pradesh;TDP;zero;Partyహైదరాబాద్ : బాలయ్య చాప్టర్ క్లోజేనా ?హైదరాబాద్ : బాలయ్య చాప్టర్ క్లోజేనా ?balayya tdp telangana{#}CBN;Balakrishna;Andhra Pradesh;TDP;zero;PartyFri, 06 Oct 2023 09:00:00 GMT


ఏపీ రాజకీయాల్లో బావమరది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ చాప్టర్ దాదాపు క్లోజ్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే బాలయ్యకు తెలంగాణా టీడీపీ బాధ్యతలు అప్పగించినట్లున్నారు. అందుకనే తెలంగాణా టీడీపీ ముఖ్యనేతలతో బాలయ్య సమావేశం పెట్టారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యతలను చంద్రబాబునాయుడు అప్పగించినట్లే అనుమానంగా ఉంది.





తెలంగాణాలో టీడీపీ పరిస్ధితి ఏమిటంటే కోమాలో ఉన్న పేషంటు లాంటి పరిస్ధితే. తెలంగాణాలో టీడీపీ పరిస్ధితి గురించి ఎంత తక్కువచెప్పుకుంటే అంత మంచిది. తెలంగాణాలో పార్టీని చంద్రబాబే గాలికొదిలేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు ఓటుకునోటులో ఇరుక్కుని విజయవాడకు పారిపోయారో అప్పుడే పార్టీ కోమాలోకి వెళిపోయింది. అప్పటినుండి పార్టీకి ఉలుకుపలుకు లేకుండా పోయింది. ఇపుడున్న నేతలంతా పార్టీని అడ్డుపెట్టుకుని డ్రామాలాడుతున్న వాళ్ళే.





ఇలాంటి పార్టీకి బాలయ్య పూర్వవైభవం తీసుకొస్తానని చెబితే ఎవరైనా నమ్ముతారా ? అసలు బాలయ్యవల్ల ఏమవుతుందో ఎవరకీ అర్ధంకావటంలేదు. చేతిలో కాగితం లేకుండా ఒక్క నిముషం కూడా  బాలయ్య గట్టిగా మాట్లాడలేరు. పదేళ్ళుగా హిందుపురం ఎంఎల్ఏగా ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో, నియోజకవర్గంలో బాలయ్య కనబడేది అంతంతమాత్రమే. మొదటినుండి బాలయ్యది పార్టీలో గెస్ట్ రోల్ మాత్రమే. ఇపుడు చంద్రబాబు అరెస్టయి జైలులో కూర్చోగానే పార్టీని ముందుండి నడిపిస్తానని బాలయ్య ప్రకటించారు.





బాలయ్య ప్రకటనతోనే జైలులో చంద్రబాబు అలర్టయిపోయారు. వెంటనే పార్టీలో పొలిటికల్ యాక్షన్ కమిటిని వేసి బాలయ్యను జీరో చేసేశారు. ఇది సరిపోదన్నట్లుగా భువనేశ్వరి, బ్రాహ్మణిని పార్టీలో  యాక్టివ్ చేయిస్తున్నారు. ఇదికూడా సరిపోదన్నట్లుగా చివరకు బాలయ్యను ఏపీ నుండి తెలంగాణాకు పంపేసినట్లున్నారు. అంటే పదేళ్ళుగా కోమాలో ఉన్న తెలంగాణా టీడీపీకి బాలయ్య జవసత్వాలు అందించాలట. ఇది అయ్యేపనేనా ? తనను ఏపీనుండి తెలంగాణాకు ఎందుకు పంపించేశారో కూడా బాలయ్యకు అర్ధమవుతున్నట్లు లేదు. రాజకీయంగా బాలయ్యే అంత చురుగ్గా ఉండేట్లయితే నందమూరి కుటుంబానికి ఇంత సమస్యలు ఎందుకు వస్తాయి ?   




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>