PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-bjp665f6966-929b-44a5-af34-bcfed12568db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-bjp665f6966-929b-44a5-af34-bcfed12568db-415x250-IndiaHerald.jpgజగన్ రాజకీయాలకు అనర్హుడని పవన్ తేల్చేశారు. తనపైన 32 కేసులు పెట్టుకుని మిగిలిన అందరిపైనా కేసులు పెట్టాలనే శాడిజంతో పరిపాలన చేస్తున్నారంటు మండిపోయారు. పవన్ తాజా యాత్రతో బీజేపీలోని అయోమయం క్లియర్ అయినట్లే అనుకోవాలి. ఇంతకాలం బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే జనసేన అధినేత పవన్ చంద్రబాబునాయుడుతో భేటీలవుతున్నారు. టీడీపీతో పవన్ను భేటీలు కానీకుండా అడ్డుకోలేక అలాగని చూస్తు ఊరుకోలేక కమలనాదులు నానా అవస్తలు పడేవాళ్ళు.janasena pawan bjp{#}Bharatiya Janata Party;Janasena;media;thursday;wednesday;TDP;Daggubati Purandeswari;Rajahmundryఅమరావతి : బీజేపీకి పవన్ పెద్ద షాక్అమరావతి : బీజేపీకి పవన్ పెద్ద షాక్janasena pawan bjp{#}Bharatiya Janata Party;Janasena;media;thursday;wednesday;TDP;Daggubati Purandeswari;RajahmundryFri, 06 Oct 2023 07:00:00 GMT



ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణే చెప్పారు. కృష్ణాజిల్లా పెడనలో వారాహియాత్రలో మాట్లాడుతు ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. కష్టంగా ఉన్నా తాను ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు.  ఎందుకు వచ్చేశారంటే తెలుగుదేశంపార్టీ చాలా కష్టాల్లో ఉందట. టీడీపీ అనుభవం+జనసేన యువరక్తం, పోరాటపటిమ కలిస్తే వైసీపీని ఓడించటం చాలా తేలికని చెప్పారు. ఓడించటమే కాకుండా జగన్ను భవిష్యత్తులో రాజకీయాల్లోకి రానీయకుండా చూడాల్సిన బాధ్యత జనాలందరిపైనా ఉందన్నారు. బుధవారం ఎన్డీయేలో నుండి వచ్చేశానని చెప్పిన పవన్ గురువారం తాను చెప్పలేదని యూ టర్న్ తీసుకోవటమే విచిత్రం.





జగన్ రాజకీయాలకు అనర్హుడని పవన్ తేల్చేశారు. తనపైన 32 కేసులు పెట్టుకుని మిగిలిన అందరిపైనా కేసులు పెట్టాలనే శాడిజంతో పరిపాలన చేస్తున్నారంటు మండిపోయారు. పవన్ తాజా యాత్రతో బీజేపీలోని అయోమయం క్లియర్ అయినట్లే అనుకోవాలి. ఇంతకాలం బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే జనసేన అధినేత పవన్ చంద్రబాబునాయుడుతో భేటీలవుతున్నారు. టీడీపీతో పవన్ను భేటీలు కానీకుండా అడ్డుకోలేక అలాగని చూస్తు ఊరుకోలేక కమలనాదులు నానా అవస్తలు పడేవాళ్ళు.





దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత చంద్రబాబు, పవన్ భేటీ అవుతున్నా పెద్దగా పట్టించుకోవటంలేదు. ఎందుకంటే పురందేశ్వరి కూడా పరోక్షంగా టీడీపీకి మద్దతిస్తున్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే చంద్రబాబుతో పవన్ భేటీ అవుతున్న విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడల్లా అది వాళ్ళిద్దరి ఇష్టమంటు తప్పించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నట్లు రాజమండ్రి జైలు దగ్గర పవన్ స్పష్టంగా చెప్పేశారు. అప్పుడు కూడా బీజేపీ ప్రస్తావన తేలేదు.





బీజేపీని వదిలేసి పవన్ టీడీపీతో వెళతారని కొంతకాలంగా అందరు అనుకుంటున్నదే. బీజేపీలోని చాలామంది నేతలకు ఈ విషయంలో క్లారిటి ఉంది. కాకపోతే ఈ విషయాన్ని పవన్ బహిరంగంగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఇపుడు వారాహియాత్రలో పవన్ బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని బీజేపీ ఊహించలేదు. బీజేపీతో పొత్తును వదిలేసుకుంటున్నట్లు ఇంతకాలం పవన్ ఎప్పుడూ చెప్పలేదు. అయితే తాజా వారాహియాత్రలో మాత్రం తనకు కష్టంగా ఉన్నా ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు. అంటే పవన్ మాటల ప్రకారమే జనసేన ఎన్డీయేలో భాగస్వామికాదని అర్ధమైపోయింది. మరిపుడు కమలనాదులు పవన్ విషయంలో ఎలా స్పందిస్తారు ? రాబోయే ఎన్నికల్లో ఏమిచేస్తారో చూడాల్సిందే. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>