MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood49f91038-6544-4a29-9348-879de50c205e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood49f91038-6544-4a29-9348-879de50c205e-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో నటులుగా, చిన్న హీరోలుగా కొనసాగిన చాలామంది ఇప్పుడు మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అలా మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేస్తున్నరు. కొంతమంది అగ్ర హీరోల సినిమాల్లో కీలకపాత్రను పోషిస్తుంటే మరి కొంతమంది నటులు డైరెక్ట్ ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అలా ఇప్పటికే జేడీ చక్రవర్తి, వేణు తొట్టెంపూడి లాంటి యాక్టర్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ చేసి మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా అదే బాటలో tollywood{#}Suresh;adhithya;dr rajasekhar;Chatrapathi Shivaji;Sivaji;Wanaparthy;Venu Thottempudi;Posters;Audience;Music;Telugu;Tollywood;Hero;Bigbossవెబ్ సిరీస్ తో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న శివాజీ ..!?వెబ్ సిరీస్ తో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న శివాజీ ..!?tollywood{#}Suresh;adhithya;dr rajasekhar;Chatrapathi Shivaji;Sivaji;Wanaparthy;Venu Thottempudi;Posters;Audience;Music;Telugu;Tollywood;Hero;BigbossFri, 06 Oct 2023 12:39:30 GMT కొంతమంది అగ్ర హీరోల సినిమాల్లో కీలకపాత్రను పోషిస్తుంటే మరి కొంతమంది నటులు డైరెక్ట్ ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అలా ఇప్పటికే జేడీ చక్రవర్తి, వేణు తొట్టెంపూడి లాంటి యాక్టర్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ చేసి మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా అదే బాటలో వెళ్తున్నారు. అతను మరెవరో కాదు తెలుగులో ఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ. 

లాంగ్ గ్యాప్ తర్వాత శివాజీ ప్రజెంట్ బిగ్ బాస్ షోతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. 'బిగ్ బాస్' సీజన్ సెవెన్ లో నంబర్ వన్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు. తొలి రోజు నుంచి తన ఆటతీరు, తోటి కంటెస్టెంట్స్ తో వ్యవహరించే తీరుతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టారు. ఈ మేరకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ 'నైన్ టీస్' (90's) అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. దాదాపు ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత శివాజీ రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సిరీస్ లో శివాజీ చంద్రశేఖర్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.

 అంతేకాకుండా ఇందులో మ్యాథ్స్ టీచర్ గా అలరించబోతున్నట్లు పోస్టర్లో చూపించారు. వనపర్తి అనే ఊరి బ్యాక్ గ్రౌండ్ లో పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ కు ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ టైటిల్ కింద ఉన్న ' ఎ మిడిల్ క్లాస్ బయోపిక్(A Middile Class Biopic) అనే క్యాప్షన్ సిరీస్ పై ఆసక్తిని పెంచింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈటీవీ విన్(Etv Win) ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ను మొదలుపెట్టిన శివాజీ ఆ తర్వాత హీరోగా మారాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇది రూల్స్ రంజన్ కాదు.. రాడ్ రంజన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>