DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawanebb8158a-3c6b-44f1-9253-c834a5906546-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawanebb8158a-3c6b-44f1-9253-c834a5906546-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా తీసుకున్న నిర్ణయాల్లో టీడీపీతో పొత్తు కన్‌ఫామ్‌గా పెట్టుకోవడం. అవసరమైతే బీజేపీని కాదని టీడీపీతోనే సాగాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్డీఏతో తెగదెంపులు కూడా చేసుకునేందుకు సిద్దపడ్డారు. ఎలాగైనా సరే టీడీపీతోనే కలిసి సాగాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన కూటమి అనే పదాలనే వాడుతున్నారు కానీ బీజేపీ గురించి ఏ సభలో కూడా మాట్లాడటం లేదు. మరో ముఖ్యమైన అంశం వైసీపీ నేత జగన్ ను గద్దె దించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్ర చేస్తున్నారు. టీడీపీ మార్గనిర్pawan{#}krishna;Nadendla Manohar;Konakalla Narayana Rao;Kollu Ravindra;Telugu;Yatra;Pawan Kalyan;Janasena;Bharatiya Janata Party;Party;MP;Jagan;TDP;YCPపవన్ యాత్ర: అందరినీ నిలబెట్టేస్తున్నాడు?పవన్ యాత్ర: అందరినీ నిలబెట్టేస్తున్నాడు?pawan{#}krishna;Nadendla Manohar;Konakalla Narayana Rao;Kollu Ravindra;Telugu;Yatra;Pawan Kalyan;Janasena;Bharatiya Janata Party;Party;MP;Jagan;TDP;YCPFri, 06 Oct 2023 08:30:00 GMTపవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా తీసుకున్న నిర్ణయాల్లో టీడీపీతో పొత్తు కన్‌ఫామ్‌గా పెట్టుకోవడం. అవసరమైతే బీజేపీని కాదని టీడీపీతోనే సాగాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్డీఏతో తెగదెంపులు కూడా చేసుకునేందుకు సిద్దపడ్డారు. ఎలాగైనా సరే టీడీపీతోనే కలిసి సాగాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన కూటమి అనే పదాలనే వాడుతున్నారు కానీ బీజేపీ గురించి ఏ సభలో కూడా మాట్లాడటం లేదు.


మరో ముఖ్యమైన అంశం వైసీపీ నేత జగన్ ను గద్దె దించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్ర చేస్తున్నారు. టీడీపీ మార్గనిర్దేశంలో జనసేన ముందుకు వెళుతుంది. వారాహి వెహికల్ లో పవన్ కల్యాణ్ ఎవరినీ ఉండనీయడం లేదు. కేవలం ఆయన ఒక్కరే ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నారు. తప్పా మిగతా నాయకులు ఎవరూ పవన్ తో వారాహి యాత్రలో పక్కన ఉండటం లేదు. మనోహర్ కూడా కిందనే కూర్చుంటున్నారు.


ఈ మధ్య జరిగిన సభలో టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ వచ్చారు. ఈయన మాజీ ఎంపీ కావడంతో అందరూ పవన్ వారాహి యాత్ర రథంపైకి పిలుస్తారని అనుకున్నారు. కానీ పవన్ మాట్లాడుతూ.. తమ సభల్లో జన సైనికులే ముందు ఉంటారని టీడీపీ నేతలు, కార్యకర్తలు వెనకాల ఉంటారని నొక్కి చెప్పారు. కొనకళ్ల, కొల్లు రవీంద్ర వేద వ్యాస్, కృష్ణ ప్రసాద్ తదితరులు కిందనే జన సైనికుల మధ్యనే నిల్చోవాల్సి వచ్చింది.


ఒకవేళ టీడీపీ నాయకులను వారాహి రథంపైకి అనుమతిస్తే జనసైనికులను పార్టీ కార్యకర్తలను కూడా పైకి ఆహ్వానించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో పవన్ సరైన నిర్ణయమే తీసుకున్నారని అందరూ అంటున్నారు. యాత్ర రథంలో ఇలా అందరూ నిలబడాలంటే వెళ్లిన ప్రతి చోట నాయకులను నిలబెట్టాల్సి వస్తుంది. కాబట్టి వారాహి యాత్ర రథంలో పవన్ తప్ప ఎవరినీ నిల్చొనీయడం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>