SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/chandrababub857b59c-3c6c-472a-802f-12502834fd48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/chandrababub857b59c-3c6c-472a-802f-12502834fd48-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు కు బెయిల్ వస్తుందా.. లేదా సుప్రీం కోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తారా లేదా.. అనేదే ప్రస్తుత చర్చాంతా.. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇరు పక్షాల వాదలను విని కేసును వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ.. సీఐడీ తరఫున ముకల్ రోహత్గీ వాదించారు. అయితే నిన్న వాదనలంతా 17 ఏ చుట్టూనే కొనసాగింది. ముందస్తు నchandrababu{#}Siddharth;court;Supreme Court;abhishek;Governor;Application;tuesday;politics;Government;CBI;CBNబాబు పీకకు చుట్టుకోనున్న మరిన్ని కేసులు?బాబు పీకకు చుట్టుకోనున్న మరిన్ని కేసులు?chandrababu{#}Siddharth;court;Supreme Court;abhishek;Governor;Application;tuesday;politics;Government;CBI;CBNThu, 05 Oct 2023 11:00:00 GMTఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు కు బెయిల్ వస్తుందా.. లేదా సుప్రీం కోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తారా లేదా.. అనేదే ప్రస్తుత చర్చాంతా.. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇరు పక్షాల వాదలను విని కేసును వాయిదా వేసింది.


సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ.. సీఐడీ తరఫున ముకల్ రోహత్గీ వాదించారు. అయితే నిన్న వాదనలంతా 17 ఏ చుట్టూనే కొనసాగింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. గవర్నర్ అనుమతి లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించారు.


దీనిపై ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. 17ఏ తో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-ఏ వచ్చింది.  అంతకంటే ముందే 2017 లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అప్పుడే దీనిని సీబీఐ పరిశీలించింది. జీఎస్టీ విభాగం దర్యాప్తు ప్రారంభించిందన్నారు.


ఈ కేసు 17 ఏ దగ్గర ఆగిపోతే చంద్రబాబు బయటపడతారు. అలా కాకుండా నిశితంగా విచారణ జరిపితే కొత్తకోణాలు బయటకి వస్తాయి. 2018లో జీఎస్టీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ కేసును వెలుగులోకి తీసుకువచ్చారు. కాబట్టి 17 ఏ  వర్తించదు అని ప్రభుత్వం వాదిస్తోంది. అప్పుడు జీఎస్టీ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలకు నోటీసులు జారీ చేస్తే వారు ఇచ్చే సమాధానంపై ఈ కేసు ఆధారపడి ఉంటుంది.


ఈ కేసులో చంద్రబాబు బయటపడితే ఇప్పుడు కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వచ్చింది. దీనిపై ఆయన ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయగా.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బయటకు వస్తే ఇవన్నీ పక్కకి వెళ్తాయి. లేకుంటే అన్ని కేసులు చుట్టుకునే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>