MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b948da9-c9fb-4c24-947c-3ed46996fc8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b948da9-c9fb-4c24-947c-3ed46996fc8f-415x250-IndiaHerald.jpgఅందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు నవీన్ చంద్ర. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించాడు. వాటితోపాటు వెబ్ సిరీస్ లతో సైతం బాగానే ఆకట్టుకుంటున్నాడు. నవీన్ చంద్ర కలర్స్ స్వాతి తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'మంత్ ఆఫ్ మధు'(Month Of Madhu). చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కలర్స్ స్వాతి ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. గతంలో నవీన్ చంద్ర, స్వాతి కాంబినేషన్లో 'త్రిపుర' అనే మూవీ వచ్చింది. ఆ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరూ జంటగా వెండితెరపై tollywood{#}Swati;bhanumathi old;naveen chandra;swathi;Chitram;srikanth;Manam;Hero;October;Telugu;Cinema;Director;Audienceకథ వినకుండానే ఈ సినిమా చేశాను, నవీన్ చంద్ర!కథ వినకుండానే ఈ సినిమా చేశాను, నవీన్ చంద్ర!tollywood{#}Swati;bhanumathi old;naveen chandra;swathi;Chitram;srikanth;Manam;Hero;October;Telugu;Cinema;Director;AudienceThu, 05 Oct 2023 14:55:00 GMTసినిమా తో తెలుగు ప్రేక్షకులను  ఎంతగానో అలరించాడు నవీన్ చంద్ర. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో  నటించాడు. వాటితోపాటు వెబ్ సిరీస్ లతో సైతం బాగానే ఆకట్టుకుంటున్నాడు.  నవీన్ చంద్ర కలర్స్ స్వాతి తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'మంత్ ఆఫ్ మధు'(Month Of Madhu). చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కలర్స్ స్వాతి ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. గతంలో నవీన్ చంద్ర, స్వాతి కాంబినేషన్లో 'త్రిపుర' అనే మూవీ వచ్చింది. ఆ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరూ జంటగా వెండితెరపై ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ని అందుకుంది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా

 ప్రమోషన్స్ లో మూవీ టీం తెగ బిజీగా ఉంది. ముఖ్యంగా నవీన్ చంద్ర, స్వాతి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఇందులో నవీన్ చంద్ర 'మంత్ అఫ్ మధు' మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథ వినకుండానే నటించానని నవీన్ చంద్ర ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు." డైరెక్టర్ శ్రీకాంత్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికంటే ముందు చేసిన భానుమతి రామకృష్ణ స్టోరీని కూడా నాకు చాలా సింపుల్ గా చెప్పారు. ఒకరోజు కారులో కూర్చున్నప్పుడు సినిమా గురించి ఒక పాయింట్ మాత్రమే చెప్పారు. మొత్తం కథ తెలియదు. కానీ పాయింట్ నచ్చి సినిమా చేసేసాను. 

'మంత్ ఆఫ్ మధు' కూడా అంతే. శ్రీకాంత్ ని నేనే అడిగాను. నెక్స్ట్ ఏంటి బ్రో అని, అప్పుడు అతను ఒకటి అనుకుంటున్నా అని అన్నాడు. అదేంటో చెప్పమని అడిగితే లైన్ చెప్పాడు. చెప్పిన వెంటనే ఇది బాగుంది కదా, మనం ఎందుకు దీని చేయకూడదు అని అన్నాను. ఆ మరుసటి రోజు ఒక మీటింగ్ జరిగింది. ఓకే అనుకున్నాం, మూవీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం కథ నాకు షూటింగ్ తర్వాత తెలిసింది. కథ మొత్తం ఇలా ఉంటుంది, ఈ సీన్ ఇలా ఉంటుంది అని తర్వాత చెప్పాడు" అంటూ నవీన్ చంద్ర తెలిపారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>