MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-in-two-parts-good-news-by-koratala491e999a-bc8d-4cdc-9444-6746b528a90f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-in-two-parts-good-news-by-koratala491e999a-bc8d-4cdc-9444-6746b528a90f-415x250-IndiaHerald.jpgతాజాగా డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులకి పండుగ లాంటి వార్త చెప్పాడు. ఎన్టీఆర్ తో ఆయన కలిసి చేస్తున్న దేవర సినిమాను రెండు భాగాలుగా రాబోతుంది అని అధికారికంగా వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న తర్వాత ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది. 'బాహుబలి' తర్వాత 'కే జి ఎఫ్' రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. 'పొన్ని యన్ సెల్వన్' కూడా రెండు భాగాలుగా tollywood{#}festival;Shiva;lord siva;Janhvi Kapoor;Allu Arjun;Tollywood;koratala siva;NTR;Blockbuster hit;Darsakudu;Director;bollywood;Cinemaరెండు భాగాలుగా 'దేవర', రిలీజ్..గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల!!రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్..గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల!!tollywood{#}festival;Shiva;lord siva;Janhvi Kapoor;Allu Arjun;Tollywood;koratala siva;NTR;Blockbuster hit;Darsakudu;Director;bollywood;CinemaThu, 05 Oct 2023 14:20:16 GMTడైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులకి పండుగ లాంటి వార్త చెప్పాడు. ఎన్టీఆర్ తో ఆయన కలిసి చేస్తున్న దేవర సినిమాను రెండు భాగాలుగా రాబోతుంది అని అధికారికంగా వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న తర్వాత ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది. 'బాహుబలి' తర్వాత  'కే జి ఎఫ్' రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. 'పొన్ని యన్ సెల్వన్' కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఐకాన్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సైతం రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే పార్ట్ వన్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

 దాంతో 'పుష్ప 2'పై అంచనాలు మరింత పెరిగాయి.తాజాగా ఈ లిస్టులో ఎన్టీఆర్ 'దేవర'(Devara) కూడా చేరింది. దర్శకుడు కొరటాల శివ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన  ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. 'దేవర చిత్రాన్ని బిగ్ కాన్వాస్ పై భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నామని, రాను రాను ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోతోందని, దాంతో ఒక భాగంలో ఈ చిత్ర కథను చెప్పడం కష్టమవుతుందని, అందుకే రెండు భాగాలుగా దేవర సినిమాని తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నా కథలో ఎలాంటి మార్పు లేదని, కానీ కాన్వాస్ మాత్రమే పెరిగిందని అన్నారు. 

ఒక్క సినిమాగా దీన్ని తీసుకురావడం కష్టమని, పర్ఫెక్ట్ గా చెప్పాలంటే రెండు భాగాలుగా చేయడం బెటర్ అనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కోస్టర్ ఏరియాలో ఇప్పటివరకు బయటకు రానటువంటి, సినిమాల్లో చూపించనటువంటి ఓ కథని 'దేవర' చిత్రంతో తాము చెప్పబోతున్నామని కొరటాల వెల్లడించారు. సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే పోస్టర్స్ ద్వారా వెల్లడించమని తెలిపారు. రెండు భాగాలుగా రాబోతున్న 'దేవర' ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5, 2024న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో భాగం మరుసటి ఏడాది అంటే 2025 లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>