MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood736f033c-c196-4103-9603-cfc5fca12699-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood736f033c-c196-4103-9603-cfc5fca12699-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల కోసం ఆయన ఎలాంటి సాహసాలను చేయడానికి అయినా వెనుకాడరు. అంతేకాదు ఓ పాత్ర కోసం ఆయన ఎక్కడి వరకైనా వెళ్తారు చివరికి ప్రాణం పెట్టేస్తారు. అది ఎలాంటి పాత్ర అయినా కావచ్చు. అందులో పరకాయ ప్రవేశం చేసే అద్భుతంగా నటిస్తారు. ప్రస్తుతం 'అఖండ', 'వీర సింహారెడ్డి' బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య త్వరలోనే 'భగవంత్ కేసరి'తో ప్రేక్షకుల ముందుకుtollywood{#}Jeevan Reddy;NTR Kathanayakudu;Research and Analysis Wing;Josh;Balakrishna;Manam;NTR;Cinemaబాలకృష్ణ నిజంగానే ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నాడు..ప్రముఖ నటుడు అప్పాజీ..!!బాలకృష్ణ నిజంగానే ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నాడు..ప్రముఖ నటుడు అప్పాజీ..!!tollywood{#}Jeevan Reddy;NTR Kathanayakudu;Research and Analysis Wing;Josh;Balakrishna;Manam;NTR;CinemaWed, 04 Oct 2023 11:48:00 GMTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల కోసం ఆయన ఎలాంటి సాహసాలను చేయడానికి అయినా వెనుకాడరు. అంతేకాదు ఓ పాత్ర కోసం ఆయన ఎక్కడి వరకైనా వెళ్తారు చివరికి ప్రాణం పెట్టేస్తారు. అది ఎలాంటి పాత్ర అయినా కావచ్చు. అందులో పరకాయ ప్రవేశం చేసే అద్భుతంగా నటిస్తారు. ప్రస్తుతం 'అఖండ', 'వీర సింహారెడ్డి' బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య త్వరలోనే 'భగవంత్ కేసరి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అయితే తాజాగా బాలయ్య గొప్పతనం గురించి, ఆయన సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధం అవుతారనే విషయాన్ని ప్రముఖ నటుడు అప్పాజీ అంబరీష ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు." బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో నేను కూడా నటించాను. ఎన్టీఆర్ కథానాయకుడు క్లైమాక్స్ లో నా పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఎన్టీఆర్ మహానాయకుడులో ఫుల్ లెన్త్ రోల్ చేశాను. సినిమాలో జీవన్ రెడ్డి పాత్ర చేశాను. ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో నన్నపని రాజకుమారి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ ముందు గాజులు పగలగొట్టే సీన్ ని షూట్ చేస్తున్నాం. ఆ సీన్ లో బాలయ్య గారి ముందు గాజులు పగలగొట్టి, ఉమ్మివేయడానికి భయపడుతున్నారు. అప్పుడు బాలయ్య గారు వాళ్లతో మనం జరిగింది చేస్తున్నాం.

మీరేం భయపడకుండా నిజంగానే గాజులు పగలగొట్టి నామీద ఉమ్మి వేయండి. ఉమ్మివేసినట్టు నటించకండి, నిజంగానే ఉమ్మేయండి అని చెప్పడంతో నేను షాక్ అయిపోయాను. ఆ తర్వాత బాలయ్య గారిని నేను ఏంట్రా దమ్ముంటే రా రా చూసుకుందాం' అని డైరెక్ట్ గా చెప్పాలి. ఆ సీన్ అయిపోయాక మీరు బాగా చేస్తున్నారు అని నన్ను అభినందించారు. సీన్ అయిపోయిన తర్వాత ప్యాకప్ చెప్పేసా మా అందరు వెళ్ళిపోయారు. ఇదంతా ఒరిజినల్ అసెంబ్లీలోనే జరిగింది. ప్యాకప్ చెప్పిన తర్వాత క్రిష్ గారితో చెప్పి బాలయ్య గారు వెళ్లిపోయారు అంటూ చెప్పుకొచ్చారు అప్పాజీ...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>