DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tdpa0037fdf-9501-4d1a-b138-f78978e9c89c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tdpa0037fdf-9501-4d1a-b138-f78978e9c89c-415x250-IndiaHerald.jpgఎన్నికల సంగ్రామం మొదలైంది. ఇప్పుడు ఏ ఇద్దరు కూర్చొని చర్చించుకున్నా తెలంగాణలో ఎవరు గెలుస్తారు. ఏపీలో సీఎం మళ్లీ జగనేనా. కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ కొడతారా దీని గురించే చర్చాంతా. అయితే ఇలా ఎవరికి వాళ్లు చర్చించుకుంటుంటే సర్వే సంస్థలు కూడా తమ ఫలితాలను వెల్లడిస్తూ ఎన్నికల వేడిని రాజేస్తున్నాయి. ఏపీలో పలు సర్వే సంస్థలు మాత్రం మళ్లీ వైసీపీనే జెండా ఎగురవేస్తోందని చెబుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులతో కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లనున్నాయి. వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలో దిగనుంది. బీజేపీ tdp{#}Janasena;Narendra Modi;MP;TDP;Yevaru;MIM Party;Survey;Bharatiya Janata Party;Congress;media;India;CM;YCPఆ సర్వే ఫలితాలు చూసి వైసీపీ నేతలు షాక్‌?ఆ సర్వే ఫలితాలు చూసి వైసీపీ నేతలు షాక్‌?tdp{#}Janasena;Narendra Modi;MP;TDP;Yevaru;MIM Party;Survey;Bharatiya Janata Party;Congress;media;India;CM;YCPWed, 04 Oct 2023 10:30:00 GMTఎన్నికల సంగ్రామం మొదలైంది. ఇప్పుడు ఏ ఇద్దరు కూర్చొని చర్చించుకున్నా తెలంగాణలో ఎవరు గెలుస్తారు. ఏపీలో సీఎం మళ్లీ జగనేనా. కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ కొడతారా దీని గురించే చర్చాంతా.  అయితే ఇలా ఎవరికి వాళ్లు చర్చించుకుంటుంటే సర్వే సంస్థలు కూడా తమ ఫలితాలను వెల్లడిస్తూ ఎన్నికల వేడిని  రాజేస్తున్నాయి. ఏపీలో పలు సర్వే సంస్థలు మాత్రం మళ్లీ వైసీపీనే జెండా ఎగురవేస్తోందని చెబుతున్నాయి.


ఏపీలో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులతో కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లనున్నాయి. వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలో దిగనుంది. బీజేపీ పై ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ, జనసేన కూటమితో వైసీపీ పనైపోయిందని.. ఆ పార్టీకి ఓటేసేవారే లేరని 160 సీట్లు మాకే వస్తాయని ఆ కూటమి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయ మీడియా అయిన ఇండియా టీవీ సర్వే ప్రకారం ఏపీలో మళ్లీ వైసీపీ దే విజయం అని స్పష్టం చేసింది. కాకపోతే బలం కాస్త తగ్గనుంది.


గతంలో వైసీపీ 22 ఎంపీ సీట్లు, టీడీపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి మాత్రం వైసీపీ 18 సీట్లు, టీడీపీ 7 సీట్లు గెలుస్తాయని తమ సర్వేలో వెల్లడైందని ఆ సంస్థ తెలిపింది.  తెలంగాణలో పార్ల మెంట్ స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉండి బీఆర్ఎస్ తో పోటీ పడుతోంది. బీఆర్ఎస్ కు 8, బీజేపీకి 6, కాంగ్రెస్ కు 2, ఎంఐఎం 1 సీట్లు వస్తాయని తెలిపింది. ఓట్ల శాతం చూస్తే గత ఎన్నికల్లో వైసీపీ 50 శాతం ఓట్లు సాధించింది. ఈ సారి 46 శాతం వస్తాయని.. టీడీపీకి 36 శాతం వస్తాయని.. బీజేపీ, జనసేన కూటమికి 8 శాతం, కాంగ్రెస్ కు 3 శాతం, ఇతరులకు 7 శాతం వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణులు మాత్రం ఖుషీలో ఉన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>