MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఅఖండ’ లాంటి సూపర్ సక్సస్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’ మూవీ విడుదలకు ముందు ఆమూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ బోయపాటి ల కాంబినేషన్ లో గతవారం విడుదల అయిన ‘స్కంద’ మూవీకి వచ్చిన టాక్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎటువంటి కొత్తదనం లేని పాత కథను ఎంచుకుని పడికట్టు పంచ్ డైలాగ్స్ తో ఊర మాస్ సినిమాగా వచ్చిన ‘స్కంద’ మూవీని ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న బోయపాటి శ్రీను ఎందుకు తీశాడు అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. వాస్తవానికి బోయపాటి మొదటి సినిమా ‘బద్ర’ మూవీతో సక్సస్ ఫుల్ దర్శకుHERO RAAM{#}Allu Aravind;Tollywood;surya sivakumar;Allu Arjun;Darsakudu;Mass;ram pothineni;Tamil;boyapati srinu;Director;Cinemaఅంతర్మధనంలో బోయపాటి !అంతర్మధనంలో బోయపాటి !HERO RAAM{#}Allu Aravind;Tollywood;surya sivakumar;Allu Arjun;Darsakudu;Mass;ram pothineni;Tamil;boyapati srinu;Director;CinemaWed, 04 Oct 2023 09:00:00 GMTఅఖండ’ లాంటి సూపర్ సక్సస్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘స్కంద’ మూవీ విడుదలకు ముందు ఆమూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ బోయపాటి ల కాంబినేషన్ లో గతవారం విడుదల అయిన ‘స్కంద’ మూవీకి వచ్చిన టాక్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎటువంటి కొత్తదనం లేని పాత కథను ఎంచుకుని పడికట్టు పంచ్ డైలాగ్స్ తో ఊర మాస్ సినిమాగా వచ్చిన ‘స్కంద’ మూవీని ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న బోయపాటి శ్రీను ఎందుకు తీశాడు అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.



వాస్తవానికి బోయపాటి మొదటి సినిమా ‘బద్ర’ మూవీతో సక్సస్ ఫుల్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆతరువాత బాలకృష్ణతో తీసిన ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ బ్లాక్ బష్టర్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకోవడంతో పాటు మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ తో తీసిన ‘సరైనోడు’ హిట్ అవ్వడంతో బోయపాటి ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్టులో చెరిపోయాడు.



అయితే అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న బోయపాటి రామ్ తో ‘స్కంద’ లాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాను ఎందుకు తీశాడు అంటూ రామ్ అభిమానులు కూడ షాక్ అవుతున్నారు. ఈసినిమా మొత్తం మితిమీరిన ఫైట్స్ తల తోక లేని కథ ఈమూవీలో ఉండటంతో వరసపెట్టి సెలవులతో లాంగ్ వీకెండ్ ఉన్నప్పటికీ ఈమూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



ఈమూవీకి 40 కోట్ల స్థాయిలో ధియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈమూవీకి వచ్చిన డల్ టాక్ తో 20 కోట్ల నెట్ కలక్షన్స్ వస్తే అది ఒక సంచలనమే అంటున్నారు. వాస్తవానికి తమిళ హీరో సూర్య అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ఇప్పుడు ‘స్కంద’ కు వచ్చిన ఘోరమైన ఫలితంతో సూర్య ఇప్పట్లో బోయపాటికి తన డేట్స్ ఇవ్వకపోవచ్చు అన్న ఊహాగానాలు ఉన్నాయి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>