MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రస్థుతం ఉన్న యంగ్ హీరోలలో మంచు విష్ణు చాల సీనియర్ ‘దేనికైనా రెడీ’ మూవీ తరువాత ఒక్క హిట్ కూడ లేకపోయినప్పటికీ వరసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా ఏకంగా ఇప్పుడు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మంచు వారి అబ్బాయి తీస్తున్న ‘భక్తకన్నప్ప’ మూవీకి సంబంధించిన వార్తలు విన్న ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. బాపు కృష్ణంరాజుల కాంబినేషన్ లో వచ్చిన ‘భక్తకన్నప్ప’ మూవీని తిరిగ తీయడం ఒక సాహసం అయితే తెలుగులో ఎటువంటి మార్కెట్ లేని విష్ణు పాన్ ఇండియా హీరోగా మారి భారీ బడ్జెట్ తో ‘భక్తకన్నప్ప’ మూవీని తీస్తూ ఉండటం టాపిక్prabhas{#}Mohanlal;manchu vishnu;mohan babu;nayantara;prakruti;Bapu;mani sharma;vishnu;Thota Chandrasekhar;New Zealand;vegetable market;lord siva;Yevaru;Kumaar;Tollywood;krishna;Mohandas Karamchand Gandhi;Industry;News;India;Prabhas;Cinemaనిన్న ప్రభాస్ ఈరోజు మోహన్ లాల్ జోష్ లో విష్ణు !నిన్న ప్రభాస్ ఈరోజు మోహన్ లాల్ జోష్ లో విష్ణు !prabhas{#}Mohanlal;manchu vishnu;mohan babu;nayantara;prakruti;Bapu;mani sharma;vishnu;Thota Chandrasekhar;New Zealand;vegetable market;lord siva;Yevaru;Kumaar;Tollywood;krishna;Mohandas Karamchand Gandhi;Industry;News;India;Prabhas;CinemaWed, 04 Oct 2023 08:00:00 GMTప్రస్థుతం ఉన్న యంగ్ హీరోలలో మంచు విష్ణు చాల సీనియర్ ‘దేనికైనా రెడీ’ మూవీ తరువాత ఒక్క హిట్ కూడ లేకపోయినప్పటికీ వరసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా ఏకంగా ఇప్పుడు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మంచు వారి అబ్బాయి తీస్తున్న ‘భక్తకన్నప్ప’ మూవీకి సంబంధించిన వార్తలు విన్న ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. బాపు కృష్ణంరాజుల కాంబినేషన్ లో వచ్చిన ‘భక్తకన్నప్ప’ మూవీని తిరిగ తీయడం ఒక సాహసం అయితే తెలుగులో ఎటువంటి మార్కెట్ లేని విష్ణు పాన్ ఇండియా హీరోగా మారి భారీ బడ్జెట్ తో ‘భక్తకన్నప్ప’ మూవీని తీస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



న్యూ జీలాండ్ లోని అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని త్వరలో ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన మహాభారతానికి దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కు అవసరమైన కాస్ట్యూమ్స్ మరియు పరికరాలను నాలుగు కంటైనర్స్ లో న్యూజిలాండ్ కు షిప్ లో పంపించారు అన్న వార్తలు వస్తున్నాయి.



ఈమూవీలో ఎవరు ఊహించని విధంగా శివుడు పాత్రలో ప్రభాస్ పార్వతిగా నయనతార నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ ప్రాజెక్ట్ లోకి మోహన్ లాల్ కూడ ఎంట్రీ ఇవ్వడం షాకింగ్ గా మారింది. అయితే మోహన్ లాల్ ఏపాత్రలో నటిస్తున్నాడు అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పరుచూరి గోపాల కృష్ణ బుర్రా సాయిమాధవ్ తోట ప్రసాద్ సంయుక్తంగా మూడు సంవత్సరాలు పరిశోధన చేసి ఈమూవీ స్క్రిప్ట్ ను తయారు చేయడంలో మోహన్ బాబు కీలక సూచనలు చేశాడు అన్న వార్తలు వచ్చాయి.



మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పాటల ట్యూన్స్ సిటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా మంచు విష్ణు సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది..  






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>