Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram2b6f9834-8710-4bf4-8078-8f56e6b3695c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram2b6f9834-8710-4bf4-8078-8f56e6b3695c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ఫిలిమ్ నగర్లో ఓ వార్త తెగ చక్కెర్లు కొడుతోంది. అదే మెగాస్టార్ చిరు, బోయపాటి కంబోలో పాన్‌ ఇండియా సినిమా రాబోతోందని. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతుండడంతో మెగాభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను మాస్ మసాలా సినిమాల సంగతి అందరికీ తెలిసినదే. దాంతో జనాలు ఈ కాంబినేషన్ పట్ల చాలా ఆతృతగా వున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ఠతో సోషియో ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టైటిల్‌ పోస్టర్‌తోనే ఈRam{#}Masala;Chiranjeevi;boyapati srinu;Darsakudu;News;Director;tuesday;India;Telugu;monday;media;Cinemaమెగాస్టార్‌ - బోయపాటి కాంబోలో.. పాన్‌ ఇండియా సినిమా రోబోతోందా?మెగాస్టార్‌ - బోయపాటి కాంబోలో.. పాన్‌ ఇండియా సినిమా రోబోతోందా?Ram{#}Masala;Chiranjeevi;boyapati srinu;Darsakudu;News;Director;tuesday;India;Telugu;monday;media;CinemaWed, 04 Oct 2023 14:49:00 GMTప్రస్తుతం తెలుగు ఫిలిమ్ నగర్లో ఓ వార్త తెగ చక్కెర్లు కొడుతోంది. అదే మెగాస్టార్ చిరు, బోయపాటి కంబోలో పాన్‌ ఇండియా సినిమా రాబోతోందని. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతుండడంతో మెగాభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను మాస్ మసాలా సినిమాల సంగతి అందరికీ తెలిసినదే. దాంతో జనాలు ఈ కాంబినేషన్ పట్ల చాలా ఆతృతగా వున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ఠతో సోషియో ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేశారు.

కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాడు. అయితే ముందుగా దేన్ని పట్టాలెక్కిస్తాడో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదంతా ఒకేత్తైతే తాజాగా చిరు కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. చిరు తన నెక్స్ట్‌ సినిమాను బోయపాటితో చేయబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దానికి కారణం లేకపోలేదు. ఆ మధ్య బోయపాటి చిరుకు ఓ లైన్‌ చెప్పాడట. అది బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి తీసుకురమ్మని సూచించాడట చిరు. ఇక చిరుకు ఫైనల్‌ నెరేషన్‌ నచ్చితే ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్‌ వుందని టాక్.

అయితే బోయపాటి ఈ సినిమాను ఎలాగన్నా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించాలని చేస్తున్నాడట. లోగుట్టు పెరుమాళ్లకెరుకగాని ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్‌గా బోయపాటి తీసిని స్కంద ఫ్లాప్‌ వెంచర్‌గా మిగిలింది. సోమవారం వరకు పర్వాలేదనిపించే కలెక్షన్‌లు వచ్చినప్పటికీ మంగళవారం తరువాత ఫుల్ కలెక్షన్లు పడిపోయాయని టాక్. కాగా స్కంద రిజల్ట్‌ చూసాక కూడా చిరు.. బోయపాటితో సినిమా చేస్తాడా లేదా అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>