SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/bhuvaneswari1dca3740-f545-442a-af29-411e9745eae5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/bhuvaneswari1dca3740-f545-442a-af29-411e9745eae5-415x250-IndiaHerald.jpgస్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఏసీబీ, హైకోర్టులో ఆయనకు చుక్కెదురు అవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేశ్ దిల్లీ లోనే ఉండి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అరెస్టు విషయంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నా పార్టీలో ఆత్మ స్థైర్యం నింపేవారు కరవయ్యారు. దీంతో ఆ బాధ్యతను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు అక్రమం అని ఆరోపిస్BHUVANESWARI{#}dr rajasekhar;vijayalakshmi;Nara Bhuvaneshwari;Jagan;tejas;BUSINESS;Train;Nara Lokesh;YCP;TDP;Mohandas Karamchand Gandhi;Andhra Pradesh;CBN;CMఅప్పుడు విజయమ్మ.. ఇప్పుడు భువనమ్మ?అప్పుడు విజయమ్మ.. ఇప్పుడు భువనమ్మ?BHUVANESWARI{#}dr rajasekhar;vijayalakshmi;Nara Bhuvaneshwari;Jagan;tejas;BUSINESS;Train;Nara Lokesh;YCP;TDP;Mohandas Karamchand Gandhi;Andhra Pradesh;CBN;CMWed, 04 Oct 2023 09:33:01 GMTస్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఏసీబీ, హైకోర్టులో ఆయనకు చుక్కెదురు అవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేశ్ దిల్లీ లోనే ఉండి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అరెస్టు విషయంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నా పార్టీలో ఆత్మ స్థైర్యం నింపేవారు కరవయ్యారు. దీంతో ఆ బాధ్యతను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


చంద్రబాబు అరెస్టు అక్రమం అని ఆరోపిస్తూ గాంధీ జయంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి సత్యమేవ జయతే అనే నినాదంతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించి భువనమ్మ దీక్ష ఎక్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఒక దశలో 3941 పోస్టులతో ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది. తొలి స్థానంలో బిహార్ కు సంబంధించిన  కులగణన అంశం ఉంది.  బిజినెస్ అండ్ ఫైనాన్స్ విషయానికొస్తే మహేంద్ర ఫౌండర్స్ డే రెండో స్థానంలో ఉంది. ఎంటర్ ట్రైన్ మెంట్ లో వీర ఫరియా మూడో స్థానంలో కొనసాగింది.


తర్వాతి స్థానం భువనమ్మ దీక్ష, అయిదో స్థానంలో తేజస్ టీజర్, ఆరోది గాంధీ జయంతి లు ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ని వైసీపీ అనుకూల మీడియాలో విజయమ్మగా  రాస్తారు.  జగన్ అరెస్టు అయిన సందర్భంలో కానీ ఇతర వైసీపీ కార్యక్రమాలు చేపట్టిన సమాయాల్లో ఇలాగే రాసేవారు. ఇతర పత్రికల్లో వైఎస్. విజయలక్ష్మి అని రాస్తుంటారు.  ఆ సమయంలో వైసీపీ అనుకూల మీడియాలో విజయమ్మ అని రాస్తే ఎవరికి అమ్మ అని టీడీపీ వాళ్లు ఎగతాళి చేసేవారు.


ఇప్పుడు అదే సమయంలో టీడీపీ కష్టకాలంలో ఉండగా భువనమ్మ అని ట్రెండింగ్ లో ఉంది. విజయమ్మ అని వాళ్లు రాస్తే భువనమ్మ అని ఎల్లో మీడియాలో రాస్తున్నారు. దీనిబట్టే అర్థం అవుతుంది. మన దాకా వచ్చేదాకా ఆ బాధ ఏంటో తెలియదు అని.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>