MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ri-religes-adhurus39f907bc-07ed-4f21-9646-0cdcd27d04de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ri-religes-adhurus39f907bc-07ed-4f21-9646-0cdcd27d04de-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు పోకిరి సినిమాతో ఈ ట్రెండు ని మొదలుపెట్టారు. స్టార్ హీరోలో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వస్తే చాలు వారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శించి నిర్మాతలు లాభపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినీ కెరియర్ లో భారీ విజయాన్ని అందుకున్న అదుర్స్ చిత్రం మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. 2010 జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదRI RELIGES;ADHURUS{#}annapurna;v v vinayak;Vallabhaneni Vamsi;Pokiri;Adhurs;Jr NTR;Makar Sakranti;mahesh babu;January;Comedy;sree;Nani;NTR;marriage;November;Blockbuster hit;Audience;Tollywood;Cinemaఎన్టీఆర్ అదుర్స్ రీ రిలీజ్ కి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే..?ఎన్టీఆర్ అదుర్స్ రీ రిలీజ్ కి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే..?RI RELIGES;ADHURUS{#}annapurna;v v vinayak;Vallabhaneni Vamsi;Pokiri;Adhurs;Jr NTR;Makar Sakranti;mahesh babu;January;Comedy;sree;Nani;NTR;marriage;November;Blockbuster hit;Audience;Tollywood;CinemaWed, 04 Oct 2023 14:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు పోకిరి సినిమాతో ఈ ట్రెండు ని మొదలుపెట్టారు. స్టార్ హీరోలో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వస్తే చాలు వారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శించి నిర్మాతలు లాభపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినీ కెరియర్ లో భారీ విజయాన్ని అందుకున్న అదుర్స్ చిత్రం మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

2010 జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా 13 ఏళ్ల కిందట వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఫుల్ టైం కామెడీగా ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీగా విజయాన్ని అందుకోవడం గమనార్హం.  ముఖ్యంగా ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే ఇప్పటికీ కూడా ప్రేక్షకులు అక్కడి నుంచి కదలరు అంటే అతిశయోక్తి కాదు.  ఈ క్రమంలోనే ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీ కొడాలి నాని నిర్మించిన విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా రెండు పాత్రల్లో కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలై 13ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2023 నవంబర్ 18 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమాని మరొకసారి ఆదరిస్తారని అభిమానులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>