Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralbfdfb6fc-276f-47e6-a975-2960b62dab8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralbfdfb6fc-276f-47e6-a975-2960b62dab8e-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన భారతదేశంలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు అటు రైల్వే సర్వీసుల ద్వారా ప్రయాణాలు సాధించగలరు. ఎన్నో రైళ్లు ఎంతో మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి రైలు ప్రయాణాలు చేసినప్పుడు కొంతమంది కాస్త అతిగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం కాస్త అత్యుత్సViral{#}Rail;Kumaar;Bihar;twitterకదిలే రైలు ఎక్కబోయాడు.. చివరికి ఏం జరిగిందో చూడండి?కదిలే రైలు ఎక్కబోయాడు.. చివరికి ఏం జరిగిందో చూడండి?Viral{#}Rail;Kumaar;Bihar;twitterTue, 03 Oct 2023 13:17:00 GMTప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన భారతదేశంలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు అటు రైల్వే సర్వీసుల ద్వారా ప్రయాణాలు సాధించగలరు. ఎన్నో రైళ్లు  ఎంతో మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి రైలు ప్రయాణాలు చేసినప్పుడు కొంతమంది కాస్త అతిగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు.


 కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి చివరికి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చివరికి కాలుజారి లేదంటే బ్యాలెన్స్ కోల్పోయి ఇక రైలుకి ఫ్లాట్ ఫారంకి మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలలో కొంతమంది తీవ్ర గాయాలు పాలు అవుతూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ఇక ప్రాణాలతో బయటపడగలుగుతున్నారు అని చెప్పాలి. అయితే భూమి మీద నూకలు బాకీ ఉంటే మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే అని చెప్పాలి. ఒక వ్యక్తి రైలుకి ఫ్లాట్ ఫారం కి మధ్యలో పడిపోయాడు. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే అని అనుకున్నారు. కానీ రైలు వెళ్లిపోయిన తర్వాత మాత్రం అతను సేఫ్ గా బయటపడ్డాడు  ఈ ఘటన బీహార్ లోని భాగాహ రైల్వేస్టేషన్లో వెలుగు చూసింది. 24 ఏళ్ళ ప్రతిక్ కుమార్ రైలులో ప్రయాణిస్తున్నాడు. స్నాక్స్ కోసం రైల్ దిగి స్నాక్స్ కొనుక్కొని రైలు దగ్గరకి వెళ్లాడు. అంతలో రైల్ కదిలింది. పరిగెత్తుకుంటూ కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడ్డాడు. అయితే ప్లాట్ ఫామ్, కదిలే రైలు మధ్య ఇరుక్కుపోయాడు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆ వ్యక్తి రైలు పట్టాలపై దిగినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రైలు వెళ్లిపోయిన తర్వాత అతను క్షేమంగా బయటపడ్డాడు. దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: భారీ ఓపెనింగ్స్ కోసం సూపర్ ప్లాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>