MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3c4507ba-ddad-401f-b756-777dc414a5eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3c4507ba-ddad-401f-b756-777dc414a5eb-415x250-IndiaHerald.jpgఒక కుటుంబాన్ని ముందుకు కొనసాగించాలి అంటే భార్యాభర్త ఇద్దరు కష్టపడితే తప్ప ఆ కుటుంబం ముందుకు వెళ్ళదు. అందుకే భార్యాభర్తలిద్దరూ కూడా కష్టపడి డబ్బులు దాచిపెట్టినప్పుడే ఆ కుటుంబం భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పనిచేసి డబ్బు సంపాదించలేని పరిస్థితుల్లో పెన్షన్ అనేది చాలా కీలకమని చెప్పుకోవాలి. వాస్తవానికి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిగ్గా పెన్షన్ లభిస్తుంది. కానీ సొంత పని లేదా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ పెన్షన్ అందాలMONEY{#}central governmentMoney: భార్యాభర్తలకు శుభవార్త.. ప్రతి నెల పెన్షన్..!Money: భార్యాభర్తలకు శుభవార్త.. ప్రతి నెల పెన్షన్..!MONEY{#}central governmentTue, 03 Oct 2023 11:00:00 GMTఒక కుటుంబాన్ని ముందుకు కొనసాగించాలి అంటే భార్యాభర్త ఇద్దరు కష్టపడితే తప్ప ఆ కుటుంబం ముందుకు వెళ్ళదు. అందుకే భార్యాభర్తలిద్దరూ కూడా కష్టపడి డబ్బులు దాచిపెట్టినప్పుడే ఆ కుటుంబం భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పనిచేసి డబ్బు సంపాదించలేని పరిస్థితుల్లో పెన్షన్ అనేది చాలా కీలకమని చెప్పుకోవాలి. వాస్తవానికి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిగ్గా పెన్షన్ లభిస్తుంది.

కానీ సొంత పని లేదా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ పెన్షన్ అందాలి అంటే మాత్రం మీరే డబ్బు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల కోసం మన దేశంలో పలు రకాల సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండగా వాటిల్లో భార్యాభర్తల కోసం నెలనెలా పెన్షన్ అందించే ఒక అద్భుతమైన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే అటల్ పెన్షన్ యోజన పథకం.  ఈ పథకంలో చేరినట్లయితే వృద్ధాప్యంలో ఎవరిపై కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వమే భార్యాభర్తలకు నెలకు పదివేల రూపాయల చొప్పున అందిస్తుంది.


దేశంలోనే 18 సంవత్సరాలు పైబడిన 4 ఏళ్ల లోపు ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ పథకంలో చేరవచ్చు.  అయితే వయసును బట్టి వారి చెల్లించాల్సిన ప్రీమియం కూడా మారుతూ ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకంలో చేరితే ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇద్దరికీ కలిపి మొత్తం రూ.10 వేలు పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల వయసులో ఈ పథకం లో చేరితే నెలకు 42 రూపాయలు చెల్లించాలి అదే 40 సంవత్సరాల వయసులో చేరితే నెలకు రూ.210 చెల్లించాలి. చేరారు ఇక రిటైర్మెంట్ తర్వాత జీవితం బాగుండాలి అంటే ఈ పథకం ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>