MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/2024-sankarti-war7e059dfd-1407-43f6-961f-abea8dea105d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/2024-sankarti-war7e059dfd-1407-43f6-961f-abea8dea105d-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోలు తమ సినిమాలు విడుదల చేసేందుకు సైతం ఎక్కువగా ఫెస్టివల్స్ ని ఫోకస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో రావడానికి కొంతమంది హీరోలు డైరెక్టర్ల నిర్మాతల సైతం ఎక్కువగా సెంటిమెంటును భావిస్తూ ఉంటారు. అయితే అలా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద తమ హవా చూపించడానికి సిద్ధంగా ఉన్న సినిమాలలో ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేద2024;SANKARTI;WAR{#}Karthik;dil raju;Akkineni Nagarjuna;mahesh babu;Ram Gopal Varma;Devarakonda;lord siva;Shiva;Akkineni Nageswara Rao;Guntur;Joseph Vijay;Makar Sakranti;ravi teja;Ravi;Box office;Success;Venkatesh;Cinema;Director;Hero2024: సంక్రాంతి బరిలో టాలీవుడ్ వార్ తప్పదా..!!2024: సంక్రాంతి బరిలో టాలీవుడ్ వార్ తప్పదా..!!2024;SANKARTI;WAR{#}Karthik;dil raju;Akkineni Nagarjuna;mahesh babu;Ram Gopal Varma;Devarakonda;lord siva;Shiva;Akkineni Nageswara Rao;Guntur;Joseph Vijay;Makar Sakranti;ravi teja;Ravi;Box office;Success;Venkatesh;Cinema;Director;HeroTue, 03 Oct 2023 10:00:00 GMTస్టార్ హీరోలు తమ సినిమాలు విడుదల చేసేందుకు సైతం ఎక్కువగా ఫెస్టివల్స్ ని ఫోకస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో రావడానికి కొంతమంది హీరోలు డైరెక్టర్ల నిర్మాతల సైతం ఎక్కువగా సెంటిమెంటును భావిస్తూ ఉంటారు. అయితే అలా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద తమ హవా చూపించడానికి సిద్ధంగా ఉన్న సినిమాలలో ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజున యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాబినేషన్లో వస్తున్న హనుమాన్ సినిమా కూడా విడుదల కాబోతోంది. మరొక సినిమా రవితేజ నటిస్తున్న ఈగల్.. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అలాగే రవితేజ నటించిన మరొక సినిమా టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20 వ తేదీన ఈ ఏడాది విడుదల కాబోతోంది.



విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పదమూడవ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమాని కూడా దిల్ రాజు బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. అక్కినేని నాగార్జున చివరిగా ఘోస్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఎలాగైనా ఈసారి సక్సెస్ అందుకోవాలని నా సామి రంగ అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ పిన్ని దర్శకత్వం వహించారు. ఇవే కాకుండా వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ ,రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా, శివ కార్తికేయ నటిస్తున్న అయాలాన్, అరణమని-4 వంటి చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎన్ని చిత్రాలు విడుదలవుతాయి పోస్ట్ అయ్యే చిత్రాలు ఏమనేది  తెలియాలి అంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>