SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/revanth81117287-a1b2-40c0-aa35-da71860b9af4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/revanth81117287-a1b2-40c0-aa35-da71860b9af4-415x250-IndiaHerald.jpgఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత చంద్రబాబునాయుడు అలాగే జగన్ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది జనాలకు. గతంలో చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉంటే, చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్నారు. గతంలో చంద్రబాబునాయుడి హవా నడిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. మరోవైపు సెంటిమెంట్లను ఆధారం చేసుకుని రాజకీయాలను నడపడంలో కేసీఆరrevanth{#}KCR;KTR;Bharatiya Janata Party;Revanth Reddy;Telangana;Reddy;Congress;Telugu Desam Party;Hyderabad;Success;Party;Telugu;Jagan;CBNరేవంత్‌ రెడ్డి.. 'చంద్ర' వ్యూహం వెనుక?రేవంత్‌ రెడ్డి.. 'చంద్ర' వ్యూహం వెనుక?revanth{#}KCR;KTR;Bharatiya Janata Party;Revanth Reddy;Telangana;Reddy;Congress;Telugu Desam Party;Hyderabad;Success;Party;Telugu;Jagan;CBNSun, 01 Oct 2023 04:00:00 GMTఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత చంద్రబాబునాయుడు అలాగే జగన్ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది జనాలకు. గతంలో చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో  16 నెలలు జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉంటే,  చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్నారు.


గతంలో చంద్రబాబునాయుడి హవా నడిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. మరోవైపు సెంటిమెంట్లను ఆధారం చేసుకుని రాజకీయాలను నడపడంలో కేసీఆర్ దిట్ట అని అంటారు.  ఉభయ రాష్ట్రాలుగా ఉంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదం అనే సెంటిమెంటును తెలంగాణ ప్రజల్లో రగిలించారు కేసీఆర్. ఆ రకంగానే ఆయన ప్రత్యేక తెలంగాణ కోసం ఆ సెంటిమెంట్ ను బలంగా వాడి సక్సెస్ అయ్యారు.


భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కేసును తమ మీదకు సింపతిలా మార్చుకుందామని అనుకున్నారు. కానీ అది కాస్త తెలుగుదేశం భారతీయ జనతా పార్టీపై, అలాగే కెసిఆర్ పై ద్వేషం అన్నట్లుగా మారిపోయింది. అయితే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రంగంలోకి దిగాడు అని అంటున్నారు.


ఒక పక్కన కేటీఆర్ చంద్రబాబు నాయుడి విషయంలో హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్ గాని, ఎవరైనా గాని గొడవలు చేయడానికి కుదరదని, కావాలంటే వెళ్లి రాజమండ్రిలో చేసుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గట్టిగా ఆంధ్ర నుండి ఎవరైనా ఏమైనా అడిగితే హైదరాబాద్ ని బాగు చేసింది ఎవరు, 400ఏళ్ల నుండి మీరే బాగు చేశారా అన్నట్లు మాట్లాడుతారు. అలాగని తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి   గత మాజీ తెలుగుదేశం పార్టీ సభ్యుడైన రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడితే గనుక అది మళ్ళీ  కాంగ్రెస్ కాళ్ళకే చుట్టుకుంటుంది ఇప్పుడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : భువనేశ్వరి కీలక నిర్ణయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>