DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/indiaebd8b616-5b85-4be8-9cbb-339fffd0bd29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/indiaebd8b616-5b85-4be8-9cbb-339fffd0bd29-415x250-IndiaHerald.jpgభారత్ శాంతికాముక దేశం. ఓ చెంప మీద కొడితే మరో చెంప చూపించడం గాంధీ సిద్ధాంతం. గతంలో భారత్ ఇదే విధానం అనుసరించేది. శత్రు దేశాలు ఎన్ని కుట్రలు చేసినా భారత్ సంయమనం పాటిస్తూ వచ్చేది. ఈ విధానానికి ఇందిరా గాంధీ కొంతమేర స్వస్తి పలికింది. ఇప్పటి ప్రధాని మోదీ దీనిని పూర్తిగా మార్చేశారు. ఒక చెంపపై మనల్ని ఎవరైనా కొడితే తిరిగి కొట్టాలన్నదే ఆయన సిద్ధాంతం. 1971లో బంగ్లాదేశ్ తో యుద్ధం జరిగిన సమయంలో భారత్ కొంత మేర పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రష్యా, అమెరికా ఒత్తిడి మindia{#}American Samoa;war;Shatru;Indira Gandhi;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Bangladesh;Jammu and Kashmir - Srinagar/Jammu;Army;Pakistan;Traffic police;Manam;India;Prime Ministerభారత్‌-పాక్‌ సరిహద్దుల్లో సైన్యం కొత్త ప్రణాళిక?భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో సైన్యం కొత్త ప్రణాళిక?india{#}American Samoa;war;Shatru;Indira Gandhi;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Bangladesh;Jammu and Kashmir - Srinagar/Jammu;Army;Pakistan;Traffic police;Manam;India;Prime MinisterSun, 01 Oct 2023 10:00:00 GMTభారత్ శాంతికాముక దేశం. ఓ చెంప మీద కొడితే మరో చెంప చూపించడం గాంధీ సిద్ధాంతం. గతంలో భారత్ ఇదే విధానం అనుసరించేది. శత్రు దేశాలు ఎన్ని కుట్రలు చేసినా భారత్ సంయమనం పాటిస్తూ వచ్చేది.  ఈ విధానానికి  ఇందిరా గాంధీ కొంతమేర స్వస్తి పలికింది. ఇప్పటి ప్రధాని మోదీ దీనిని పూర్తిగా మార్చేశారు. ఒక చెంపపై మనల్ని ఎవరైనా కొడితే తిరిగి కొట్టాలన్నదే ఆయన సిద్ధాంతం.


1971లో బంగ్లాదేశ్ తో యుద్ధం జరిగిన సమయంలో భారత్ కొంత మేర పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రష్యా, అమెరికా ఒత్తిడి మేరకు ఆక్రమించిన గ్రామాలను తిరిగి ఇవ్వాలని అప్పటి ప్రధానులు ఇందిరా, పీవీ నరసింహారావులు సూచించారు. ఆ గ్రామాలను తిరిగి ఇస్తే తీవ్రవాదులకు అడ్డగా మారతాయనే ఉద్దేశంతో సైన్యం వాటిని ఇచ్చేందుకు విముఖత చూపింది.


విదేశాంగ విధానం, రక్షణ విధానంపై ఓ స్పష్టత లేకుండా పోయింది. ఆ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిరాకరించేది. దీనివల్ల ఆ గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయి మన పై వ్యతిరేకత వస్తోందని సైన్యం హెచ్చరించినా లెక్క చేయలేదు. మోదీ ప్రధాని పదవి చేపట్టాక సైన్యం ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. మనం అక్కడ మౌలిక వసతుల కల్పనలో విఫలమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వివరించింది. అంతిమంగా అది భారత్ కు చేటు తెస్తుందని హెచ్చరించింది.


ఆక్రమించిన పాక్ గ్రామాలు ఉగ్రవాదులకు ఆవాసం కావొద్దన్న ఉద్దేశంతో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. తాగు నీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. అంతేకాకుండా అక్కడి పాక్ గ్రామాలకు సరికొత్త పేర్లు పెడుతుంది. ఈ మేరకు వివరాలను జమ్మూ కాశ్మీర్ డైరక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ దిల్ బార్ సింగ్ సంబంధిత వివరాలను వెల్లడించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో అంటే క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>