HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health5a9de356-bb28-4418-a851-e1fe08dcef3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health5a9de356-bb28-4418-a851-e1fe08dcef3c-415x250-IndiaHerald.jpgమనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ద వహించాలి. మనం చక్కటి ఆహారాన్ని తీసుకుంటేనే మనం ఏ పని అయిన సులభంగా చేయగలుగుతాము. ఇంకా చక్కటి నిద్రను సొంతం చేసుకోగలుగుతాము. మనం ఏ ఆహారాలను తీసుకున్నా తీసుకోకపోయిన ఇప్పుడు చెప్పే ఆహారాలను మాత్రం ఖచ్చితంగా ప్రతి రోజూ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం ప్రతి రోజూ తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా ఒకటి. ఎందుhealth{#}Vitamin;Onion;Ginger;Sugar;garlic;Cholesterol;Shakti;Manam;Cancer;Heartరోజూ తప్పకుండా తినాల్సిన ఫుడ్స్ ఇవే?రోజూ తప్పకుండా తినాల్సిన ఫుడ్స్ ఇవే?health{#}Vitamin;Onion;Ginger;Sugar;garlic;Cholesterol;Shakti;Manam;Cancer;HeartSun, 01 Oct 2023 13:32:00 GMTమనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ద వహించాలి. మనం చక్కటి ఆహారాన్ని తీసుకుంటేనే మనం ఏ పని అయిన సులభంగా చేయగలుగుతాము. ఇంకా చక్కటి నిద్రను సొంతం చేసుకోగలుగుతాము. మనం ఏ ఆహారాలను తీసుకున్నా తీసుకోకపోయిన ఇప్పుడు చెప్పే ఆహారాలను మాత్రం ఖచ్చితంగా ప్రతి రోజూ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం ప్రతి రోజూ తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా ఒకటి. ఎందుకంటే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.రక్తప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా సాగుతుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు మనల్ని ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. అలాగే పోషకాలు కలిగి ఉన్న ఆహారాల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిలో విటమిన్ సి, లైకోపీన్, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ ఇ, ప్లేవనాయిడ్స్ ఇంకా ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇంకా డయాబెటిస్ వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడడంలో కూడా టమాటాలు మనకు దోహదపడతాయి. కాబట్టి ఇవి కూడా రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా అదే విధంగా మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఉల్లిపాయలు కూడా ఒకటి.


మనం ఉల్లిపాయలను వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.అలాగే వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక అలాగే మనం వంటల్లో అల్లాన్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అల్లం కూడా మన ఆహారంలో ప్రతి రోజూ ఉండేలా చూసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం బాగా సహాయపడుతుంది. అధిక బరువును, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇంకా జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో అల్లం మనకు ఎంతో దోహపడుతుంది. ఇక ప్రతి రోజూ పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, క్యాల్షియం, జింక్, ఐరన్, వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.దీనిని తీసుకోవడం వల్ల బరువు ఈజీగా అదుపులో ఉంటుంది. ఇంకా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాలుగో ఎలిమినేషన్.. హౌస్ లోంచి వెళ్లిపోయేది ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>