EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan613f56ca-63f0-4299-a6e5-0fbef3dbd76b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan613f56ca-63f0-4299-a6e5-0fbef3dbd76b-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, సీపీఎస్ పై ఆలోచించింది. ఓపీఎస్ తో సుదీర్ఘ భవిష్కత్తులో జీతాలు చెల్లింపులకు సైతం ఇబ్బందులొస్తాయి. ఇక సీపీఎస్ ను అమలు చేస్తే వడ్డీ రేట్లు తగ్గి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు సరైన రాబడి ఇవ్వకపోతే ఉద్యోగులకు నష్టం వస్తోంది. అందుకే దీనిపై బాగా ఆలోచించి మధ్యేమార్గంగా జీపీఎస్ ను తెచ్చాం అని ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలివి. కాగా ఈ అంశంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఓపీఎస్ పై బుగ్గన స్పందిస్తూ రాష్ట్రం మొత్తం రాబడిలో హెచ్ ఆర్ ఖర్చులే ఎక్కువగా jagan{#}Kanna Lakshminarayana;Buggana Rajendranath Reddy;vegetable market;Andhra Pradesh;YCP;central government;Government;Ministerవాళ్ల జీతాలు పెంచేసిన సీఎం జగన్‌?వాళ్ల జీతాలు పెంచేసిన సీఎం జగన్‌?jagan{#}Kanna Lakshminarayana;Buggana Rajendranath Reddy;vegetable market;Andhra Pradesh;YCP;central government;Government;MinisterSun, 01 Oct 2023 05:00:00 GMTరాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, సీపీఎస్ పై ఆలోచించింది. ఓపీఎస్ తో సుదీర్ఘ భవిష్కత్తులో జీతాలు చెల్లింపులకు సైతం ఇబ్బందులొస్తాయి. ఇక సీపీఎస్ ను అమలు చేస్తే వడ్డీ రేట్లు తగ్గి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు సరైన రాబడి ఇవ్వకపోతే ఉద్యోగులకు నష్టం వస్తోంది. అందుకే దీనిపై బాగా ఆలోచించి మధ్యేమార్గంగా జీపీఎస్ ను తెచ్చాం అని ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలివి.


కాగా  ఈ అంశంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఓపీఎస్ పై బుగ్గన స్పందిస్తూ రాష్ట్రం మొత్తం రాబడిలో హెచ్ ఆర్ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో జీతాలు పెన్షనర్లకు 2014-15లో 70శాతం ఉంటే.. 20019-20లో వంద శాతం, 2020-21 నాటికి 110 శాతం అయింది. అంటే మన రాష్ట్రానికి వచ్చే రాబడి కన్నా పెన్షన్లకు, జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది అని.


వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన జీతాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంగన్వాడీ జీతాలను రూ.7 వేల నుంచి రూ.11,500కు పెంచారు. అంగన్వాడీ సహాయకులకు  రూ.4 నుంచి 7 వేలకు పెంచారు. వీరితో పాటు సంఘ మిత్రలు   గతంలో రెండువేల ఉంటే ప్రస్తుతం రూ.10 వేలు చేశారు. శానిటరీ వర్కర్స్ కు రూ. 8వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. ఆశా వర్కర్లకు రూ.4 వేల నుంచి 10 వేలకు పెంచారు.   కార్మిక ఉపాధి కల్పన లో పనిచేస్తున్న ఎంఎన్వోలకు రూ.6700 ఉంటే రూ.17746 లు ఇస్తున్నాం.  ఏఎన్ఎంకు 10,200 నుంచి 28 వేలకు, దోభీకి, క్షరకులకు 6700 నుంచి 13 వేలకు, హోం గార్డు డైలీ డ్యూటీ అలవెన్సుల కింద 600 నుంచి 710 కి పెంచామని తెలిపారు.


మొత్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులకు జీతాల పెంపు ద్వారా ఆర్థిక భారం రూ.2వేల కోట్ల నుంచి రూ.3500 కోట్లకు చేరిందన్నారు.  ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అనేది మాత్రం చెప్పలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : భువనేశ్వరి కీలక నిర్ణయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>