PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuvaneswari-brahmani-tdp-2a30a8e1-2d0c-40c0-b741-a192d9d73f16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuvaneswari-brahmani-tdp-2a30a8e1-2d0c-40c0-b741-a192d9d73f16-415x250-IndiaHerald.jpgఇంతకీ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కు ఎలా సంబంధముంది ? ఎలాగంటే హెరిటేజ్ సంస్ధలో లోకేష్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. అలాగే మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. మంత్రి హోదాలో రియాల్టర్ లింగమనేని రమేష్ ఫాం హౌస్ కు లాభం జరిగేట్లుగా రింగ్ రోడ్డు అలైన్మెంటును మూడుసార్లు మార్పులు చేయించారట. అలాగే లింగమనేని నుండి భూములు కొనాలని తీర్మానించిన హెరిటేజ్ బోర్డులో లోకేష్ డైరెక్టర్. అంటే హెరిటేజ్ లో డైరెక్టర్ హోదాలోను ప్రభుత్వంలో మంత్రిగాను డబల్ రోల్ పోషించారు. bhuvaneswari brahmani tdp {#}Lingamaneni Ramesh;court;Nara Lokesh;Heritage Foods;bhuvaneshwari;Nara Brahmani;Nara Bhuvaneshwari;Lokesh;Lokesh Kanagaraj;House;Minister;Directorఅమరావతి : వీళ్ళపైన కూడా కత్తి వేలాడుతోందా ?అమరావతి : వీళ్ళపైన కూడా కత్తి వేలాడుతోందా ?bhuvaneswari brahmani tdp {#}Lingamaneni Ramesh;court;Nara Lokesh;Heritage Foods;bhuvaneshwari;Nara Brahmani;Nara Bhuvaneshwari;Lokesh;Lokesh Kanagaraj;House;Minister;DirectorSun, 01 Oct 2023 09:00:00 GMT



గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే అందరిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. భువనేశ్వరి, బ్రాహ్మణి మీద కూడా కేసులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా లోకేష్ పాత్ర కీలకమని ఏ 14 గా సీఐడీ కేసు నమోదుచేసింది. తన అరెస్టు తప్పదని అర్ధమైన లోకేష్ వెంటన హైకోర్టులో ముందస్తుబెయిల్ పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. కాబట్టి సీఐడీ విచారణకు హాజరుకాకుండా లోకేష్ కు వేరేదారిలేదు.





ఇంతకీ రింగ్ రోడ్డు కుంభకోణంలో  లోకేష్ కు ఎలా సంబంధముంది ? ఎలాగంటే హెరిటేజ్ సంస్ధలో లోకేష్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. అలాగే మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. మంత్రి హోదాలో రియాల్టర్ లింగమనేని రమేష్ ఫాం హౌస్ కు లాభం జరిగేట్లుగా రింగ్ రోడ్డు అలైన్మెంటును మూడుసార్లు మార్పులు చేయించారట. అలాగే లింగమనేని నుండి భూములు కొనాలని తీర్మానించిన హెరిటేజ్ బోర్డులో లోకేష్  డైరెక్టర్.  అంటే హెరిటేజ్ లో డైరెక్టర్ హోదాలోను ప్రభుత్వంలో మంత్రిగాను డబల్ రోల్ పోషించారు.





లింగమనేనికి లాభం చేకూర్చటం ద్వారా కరకట్టమీద ఉన్న అక్రమనిర్మాణాన్ని బహుమతిగా చంద్రబాబునాయుడు అందుకున్నారు. ఇదే సమయంలో కారుచౌకగా లింగమనేని నుండి 15 ఎకరాలను హెరిటేజ్ సంస్ధ సొంతం చేసుకున్నది. ఇదంతా క్విడ్ ప్రో కో కిందకే వస్తుందని సీఐడీ వాదిస్తోంది. అలైన్మెంట్ మార్పులు చేయాలని లోకేష్ ఒత్తిడి చేసినట్లు అప్పట్లో సీఆర్డీయేలో పనిచేసిన అధికారులు వాగ్మూలాలు ఇచ్చారట.





ఇంతవరకు బాగానే ఉంది మరి భువనేశ్వరి, బ్రాహ్మణి రోల్ ఏమిటి ? ఏమిటంటే హెరిటేజ్ సంస్ధలో లోకేష్  డైరెక్టర్ అయితే భువనేశ్వరి వైస్ ఛైరపర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. వీళ్ళిద్దరికీ చంద్రబాబునాయుడుకు ఉన్న సంబంధం చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే సీఐడీ ముందుజాగ్రత్తగా హెరిటేజ్ ను రింగ్ రోడ్డు కేసులో ఏ 6 గా చేర్చింది. డైరెక్టర్ హోదాలో లోకేష్ పైన కేసు పెట్టినపుడు మరి మేనేజింగ్ డైరెక్టర్ గా భువనేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బ్రాహ్మణి మీద కేసులు పెట్టకుండా ఉంటుందా అనే  ప్రచారం పెరిగిపోతోంది. మరి సీఐడీ ఏమిచేస్తుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో అంటే క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>