HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health866ae25d-9577-47e3-a1ed-999b51d13dda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health866ae25d-9577-47e3-a1ed-999b51d13dda-415x250-IndiaHerald.jpgబయోటిన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. ఆమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్ల ఉపయోగంలో, చర్మాన్ని ఇంకా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, .జుట్టు కుదుళ్లను ధృడంగా చేయడంలో, గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, అందమైన మచ్చలేని చర్మాన్ని అందించడంలో బయోటిన్ మనకు చాలా సహాయపడుతుంది. ఇతర పోషకాల లాగే బయోటిన్ కూడా మన శరీరానికి చాలా అవసరం. బయోటిన్ లోపించడం వల్ల మనం చాలా రకాల దుష్ప్రభావాలను ఎదర్కోవాల్సి ఉంటుంది.ఇక బయోటిన్ లోపం కారణంగా శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. చర్మం ఎర్రబడడం, చర్మంపై పHEALTH{#}gummadi;vegetable market;Air;Manamరోజూ ఒక స్పూన్ ఈ పొడి తింటే ఎన్నో లాభాలు?రోజూ ఒక స్పూన్ ఈ పొడి తింటే ఎన్నో లాభాలు?HEALTH{#}gummadi;vegetable market;Air;ManamSun, 01 Oct 2023 13:50:00 GMTబయోటిన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. ఆమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్ల ఉపయోగంలో, చర్మాన్ని ఇంకా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, .జుట్టు కుదుళ్లను ధృడంగా చేయడంలో, గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, అందమైన మచ్చలేని చర్మాన్ని అందించడంలో బయోటిన్ మనకు చాలా సహాయపడుతుంది. ఇతర పోషకాల లాగే బయోటిన్ కూడా మన శరీరానికి చాలా అవసరం. బయోటిన్ లోపించడం వల్ల మనం చాలా రకాల దుష్ప్రభావాలను ఎదర్కోవాల్సి ఉంటుంది.ఇక బయోటిన్ లోపం కారణంగా శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. చర్మం ఎర్రబడడం, చర్మంపై పొట్టు లేవడం ఇనము దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది.అందుకే మన శరీరంలో తగినంత బయోటిన్ ఉండేలా చూసుకోవాలి. మనకు బయోటిన్ లోపం రాకుండా ఉండాలంటే మనం బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని కోసం మనం ఎక్కువగా చేపలు, మాంసం, పోయాబీన్స్, టమాటాలు, పాలు, గింజలు ఇంకా కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి.ఇంకా అలాగే మన ఇంట్లో ఉండే పదార్థాలతో బయోటిన్ పౌడర్ ను తయారు చేసుకుని తీసుకోవాలి. దీన్ని రోజూ ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల బయోటిన్ లోపం తగ్గడంతో మరలా రాకుండా ఉంటుంది.


ఇంకా అలాగే చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన ఆరోగ్యానికి బాగా మేలు చేసే ఈ బయోటిన్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి…ఇంకా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఈ పొడిని తయారు చేసుకోవడానికి  మనం ముందుగా ఒక కళాయిలో ఒక కప్పు బాదం, ఒక కప్పు వాల్ నట్స్, అర కప్పు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ చియా విత్తనాలు, అర కప్పు అవిసె గింజలు, ఒక కప్పు గుమ్మడి గింజలు ఇంకా అర కప్పు పుచ్చకాయ గింజలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఇక ఇవి చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి.ఆ తరువాత ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయోటిన్ పౌడర్ ఈజీగా తయారవుతుంది. బయోటిన్ లోపంతో బాధపడే వారు ఈ లోపం రాకూడదు అనుకునే వారు ఈ పొడిని ప్రతి రోజూ ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. పిల్లలకు కూడా ఈ పొడిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాలుగో ఎలిమినేషన్.. హౌస్ లోంచి వెళ్లిపోయేది ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>