MoneyChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money6e53a488-0570-4ebe-b796-b3efd01f3d67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money6e53a488-0570-4ebe-b796-b3efd01f3d67-415x250-IndiaHerald.jpgదేశాభివృద్ధి చెందాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా పన్నుల వసూలు తప్పనిసరి. పన్నుల గురించి మాట్లాడుకోవాలంటే నాడు నేడు అని వేర్వేరుగా చర్చించాలి ఏమో.. ఎందుకంటే నాడు భారతదేశంలో ఎంత పన్ను ఎగ్గొట్టేవారు.. నేడు ఎంత మంది కడుతున్నారు. ఇది కీలకమైన అంశం. పన్నుల పరంగా ప్రత్యక్ష పన్నులు రూ.8.65 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నాటికి నికర ప్రత్యక్ష వసూళ్లు 23.51 శాతం పెరిగి.. రూ. 8.65 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయని ఆర్థక శాఖ వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచmoney{#}Corporateఖజానా ఫుల్‌: మోడీ వసూళ్లు మామూలుగా లేవుగా?ఖజానా ఫుల్‌: మోడీ వసూళ్లు మామూలుగా లేవుగా?money{#}CorporateSun, 01 Oct 2023 09:30:00 GMTదేశాభివృద్ధి చెందాలన్నా..  సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా పన్నుల వసూలు తప్పనిసరి. పన్నుల గురించి మాట్లాడుకోవాలంటే  నాడు నేడు అని వేర్వేరుగా చర్చించాలి ఏమో.. ఎందుకంటే నాడు భారతదేశంలో ఎంత పన్ను ఎగ్గొట్టేవారు.. నేడు ఎంత మంది కడుతున్నారు.  ఇది కీలకమైన అంశం.  పన్నుల పరంగా ప్రత్యక్ష పన్నులు రూ.8.65 లక్షల కోట్లు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నాటికి నికర ప్రత్యక్ష వసూళ్లు 23.51 శాతం పెరిగి.. రూ. 8.65 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయని ఆర్థక శాఖ వెల్లడించింది.  


పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.18.28 లక్షల కోట్లలో ఇది 47.45 శాతం.  అంటే ఏడాదికి పన్నుల రూపంలో రూ.18.28లక్షల కోట్లు వస్తుండగా ఇప్పటికే ఆరు నెలలకే రూ.8.65లక్షల కోట్లు వచ్చేశాయి. (మన ఆర్థిక సంవత్సరం మార్చితో మొదలవుతుంది).  
ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్నులు రూ. 4,16,217 కోట్లు.  సెక్యూరిటీ లావాదేవీల పన్నులతో కలిపి వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4,47,291కోట్లుగా ఉన్నాయి.  సెప్టెంబరు మధ్య నాటికి ముందస్తు పన్ను చెల్లింపులు  రూ.3.55లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో 2.94లక్షల కోట్లు పన్నులు వసూలు అయ్యాయి. ముందస్తు చెల్లిపులు 21 శాతం మేర పెరిగాయి.


పన్నుల వసూళ్లలో స్థిరమైన వృద్ధి ఇందుకు దోహదం చేశాయి. ముందస్తు పన్నుల చెల్లింపులకు సెప్టెంబరు 15తో గడువు ముగిసింది. ముందస్తు పన్ను చెల్లింపు రూ.3.55లక్షల కోట్లలో కార్పొరేట్ ఆదాయ పన్ను రూ. 2.8 లక్షల కోట్లు, వ్యక్తిగత పన్ను చెల్లింపులు రూ.74, 858 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరు 16 నాటికి మొత్తం 1.22 లక్షల కోట్లు రిఫండులు జారీ అయ్యాయి. స్థూలంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.78 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ. 8.34లక్షల కోట్లు వసూలయ్యాయి. క్రితం సారితో పోల్చితే 18.9 శాతం మేర పెరిగాయి





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో అంటే క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>