PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jail-cid19825437-4c41-482f-9c05-ceadc065ca09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jail-cid19825437-4c41-482f-9c05-ceadc065ca09-415x250-IndiaHerald.jpgనిజానికి ఇది వినటానికే పెద్ద జోకుగా ఉంటుంది. ఇపుడు కూడా పోస్టుకార్డులు రాసే వాళ్ళున్నారా అన్నదే పెద్ద పాయింట్. పోస్టు కార్డులు, ఇన్ ల్యాండ్ లెటర్లను ఇపుడు ఎవరు ఉపయోగిస్తున్నారు ? కార్డులు పోస్టాఫీసుల్లోనే పెద్దగా దొరకటంలేదు. అయినా ఎక్కడో కార్డులను దొరికించుకున్నారని అనుకున్నా ఎంతమందికి దొరుకుతుంది ? కార్డులు రాసే వాళ్ళెవరు ? అందుకనే తమ్ముళ్ళు ఏమిచేస్తున్నారంటే కార్డులను ఎక్కడో పెద్దమొత్తంలో కొనేసి తామే రాజమండ్రి జైలుకు, పోస్టాఫీసు అడ్రస్ కు రాసేస్తున్నారు. chandrababu jail cid{#}Rajahmundry;CBN;Yevaru;Party;TDPఅమరావతి : ఉద్యమమంతా బోగస్సేనా ?అమరావతి : ఉద్యమమంతా బోగస్సేనా ?chandrababu jail cid{#}Rajahmundry;CBN;Yevaru;Party;TDPSat, 30 Sep 2023 09:00:00 GMT

స్కిల్ స్కామ్ లో అరెస్టయి, రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు మద్దతుగా రాష్ట్రంలోని జనాలంతా పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నట్లు ఎల్లోమీడియా, టీడీపీ ఒకటే ఊదరగొడుతోంది. అయితే ఆ ఉద్యమం అంతా ఎల్లోమీడియాలో మాత్రమే నడుస్తోందనే విషయం బయటపడింది. చంద్రబాబుకు మద్దతుగా జనాలు చేస్తున్న ఉద్యమం ఏమిటంటే మీతోనే మేము అనే స్లోగన్ తో పోస్టు కార్డుల ఉద్యమం అట. చంద్రబాబుకు మద్దతుగా జనాలంతా పోస్టుకార్డుల మీద మీతోనే మేము అని రాసి రాజమండ్రి జైలుకు కార్డులు పోస్టు చేస్తున్నారట.





నిజానికి ఇది వినటానికే పెద్ద జోకుగా ఉంటుంది. ఇపుడు కూడా పోస్టుకార్డులు రాసే వాళ్ళున్నారా అన్నదే పెద్ద పాయింట్. పోస్టు కార్డులు, ఇన్ ల్యాండ్ లెటర్లను ఇపుడు ఎవరు ఉపయోగిస్తున్నారు ? కార్డులు పోస్టాఫీసుల్లోనే పెద్దగా దొరకటంలేదు. అయినా ఎక్కడో కార్డులను దొరికించుకున్నారని అనుకున్నా ఎంతమందికి దొరుకుతుంది ? కార్డులు రాసే వాళ్ళెవరు ? అందుకనే తమ్ముళ్ళు ఏమిచేస్తున్నారంటే కార్డులను ఎక్కడో పెద్దమొత్తంలో కొనేసి తామే రాజమండ్రి జైలుకు, పోస్టాఫీసు అడ్రస్ కు రాసేస్తున్నారు.





చంద్రబాబుకు మద్దతుగా కొన్నిచోట్ల  దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షల్లో కూర్చున్న వాళ్ళే మారుపేర్లతో కార్డులు రాసేసి జైలు అడ్రస్ కు పంపేస్తున్నారు. తమ్ముళ్ళ లెక్కప్రకారం ఇప్పటికి రాజమండ్రికి  7 లక్షల కార్డులు వచ్చాయట. మరి ఈ విషయమై జైలు అధికారులు కానీ పోస్టీఫీసు వాళ్ళయితే ఏమీ మాట్లాడటంలేదు. తమ్ముళ్ళు చెప్పినట్లు అసలన్ని కార్డులు మామూలు జనాలు రాశారా అన్నది అనుమానమే.




చంద్రబాబు అరెస్టుకు మామూలు జనాలు లక్షల్లో స్పందిస్తున్నారని కలరింగ్ ఇచ్చుకునేందుకు తమ్ముళ్ళే ఇదంతా చేస్తున్నారు.  నిజంగానే చంద్రబాబు అరెస్టుకు జనాలంతా అంతగా స్పందిస్తే మరి రాజమండ్రి జైలు ముందు అసలు జనాలేరి ? జైలు ముందు జనాలు ఈపాటికే భారీఎత్తున ఆందోళన చేసుండాలి కదా ? మామూలు జనాలు కాదు చివరకు పార్టీ జనాలు కూడా కనబడటంలేదు. అరెస్టుచేసి రిమాండుకు తీసుకొచ్చిన మొదటి రెండు రోజులు కొందరు నేతలు కనిపించారు తర్వాత వాళ్ళల్లో కూడా చాలామంది కనిపించంటంలేదట. నేతల్లోనే కనబడని స్పందన మామూలు జనాల్లో ఉంటుందా ?




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాపం.. రూ.3 ఇవ్వలేదని.. రూ.25 వేల ఫైన్ పడింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>