DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababuf85f9901-65ec-4f64-a75f-790c3cf1adae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababuf85f9901-65ec-4f64-a75f-790c3cf1adae-415x250-IndiaHerald.jpgఏపీ చరిత్రలో చంద్రబాబు ది అరుదైన రికార్డు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఏ రాజకీయ నేతకు సాధ్యం కానీ విధంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్లు ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు. అదే ఎన్టీఆర్ విషయానికొస్తే సీఎంగా ఆరు ఏళ్లు, ప్రతిపక్షనేతగా అయిదేళ్లు కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిదేళ్లు ప్రతిపక్ష నేత, ఆరేళ్లు సీఎం గా సేవలందించారు. రాష్ట్ర విభజన జరిగాక అయిదేళ్లు సీఎం, అయిదేళ్లు ప్రతిపక్ష పాత్రను జగన్, సీఎంలు పోషించారు. ఇలాంటి అరుదైన రికార్డులు సాధించిన చంద్రబాబు ఇప్పుడు ఓ అపఖchandrababu{#}NTR;dr rajasekhar;Prakasam;Tanguturi Prakasam;Jagan;CM;Rajahmundry;Telangana;CBNచంద్రబాబు జీవితంలోనే ఇదో చెత్త రికార్డ్‌?చంద్రబాబు జీవితంలోనే ఇదో చెత్త రికార్డ్‌?chandrababu{#}NTR;dr rajasekhar;Prakasam;Tanguturi Prakasam;Jagan;CM;Rajahmundry;Telangana;CBNSat, 30 Sep 2023 10:30:00 GMTఏపీ చరిత్రలో చంద్రబాబు ది అరుదైన రికార్డు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు.  ఏ రాజకీయ నేతకు సాధ్యం కానీ విధంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్లు ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు. అదే ఎన్టీఆర్ విషయానికొస్తే సీఎంగా ఆరు ఏళ్లు, ప్రతిపక్షనేతగా అయిదేళ్లు కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిదేళ్లు  ప్రతిపక్ష నేత, ఆరేళ్లు  సీఎం గా సేవలందించారు.


రాష్ట్ర విభజన జరిగాక అయిదేళ్లు సీఎం, అయిదేళ్లు  ప్రతిపక్ష పాత్రను జగన్, సీఎంలు పోషించారు. ఇలాంటి అరుదైన రికార్డులు సాధించిన చంద్రబాబు ఇప్పుడు ఓ అపఖ్యాతిని మూట గట్టుకున్నాడు. అదేంటంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలు కెళ్లిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు.  అవినీతి చేసి నిరూపణ అయ్యాక జైలుకు వెళ్లిన ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఆరోపణలతో ఎవరూ వెళ్లలేదు. జలగం వెంగళరావు.. టంగుటూరి ప్రకాశం కాలం దగ్గర నుంచి..  నేటి వరకు అవినీతి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారే తప్ప ఎవరూ కూడా అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లలేదు.  ఇది సరికొత్త బ్యాడ్ రికార్డు.


జగన్ మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సీఎం అయ్యారు. ఒకవేళ తర్వాత జగన్ జైలుకు వెళ్లినా రెండో వ్యక్తి అవుతారు. ఉమ్మడి ఏపీలో ఇప్పటి వరకు ముగ్గురు మాజీ సీఎంలు రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్లారు. రాష్ట్ర విభజన జరిగాక ఆ చెత్త రికార్డు కూడా బాబు పేరిటే ఉంటుంది. టంగుటూరు ప్రకాశం పంతులు సీఎంగా పనిచేయక ముందు బ్రిటీష్ అధికారుల ఆదేశాలు పాటించనందుకు వెళ్లారు.  


మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఈ జైలులో గడిపారు. వీళ్లిద్దరూ జైలు జీవితం గడిపాక సీఎంలు అయ్యారు.  కానీ చంద్రబాబు విషయానికొస్తే సీఎం అయ్యాక రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఇది కచ్ఛితంగా చంద్రబాబుకు చెత్త రికార్డే అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాపం.. రూ.3 ఇవ్వలేదని.. రూ.25 వేల ఫైన్ పడింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>