PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/canada449b76b4-fcc6-41ce-b039-ab22bb18df1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/canada449b76b4-fcc6-41ce-b039-ab22bb18df1e-415x250-IndiaHerald.jpgచెరపకు రా చెడేవు అనేది సామెత. భారత్ మీద బురద జల్లేందుకు యత్నిస్తున్న కెనడా ఇప్పుడు తాను చెడుతోంది. ఇప్పటికే భారత్, కెనడా సంబంధాలు ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశాభివృద్ధికి ఆటంకం సృష్టించే ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ ఓ వైపు పోరాడుతుంటే.. మన దేశానికి వ్యతిరేకంగా ఉండే ఖలీస్థానీ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఖలీస్థానీ టైగర్ ఫోర్స్ కు చెందిన నిజ్జర్ హత్యతో మరొకరు హత్య గావించబడటం కెనడా తీవ్రవాదుల స్వర్గం అనే ప్రచారం ప్రపంచ దేశాలకు canada{#}Russia;Japan;Heaven;Murder.;Europe countries;Canada;Research and Analysis Wing;Pakistan;Hero;Indiaమరో వివాదంలో పరువుపోగొట్టుకుంటున్న కెనడా?మరో వివాదంలో పరువుపోగొట్టుకుంటున్న కెనడా?canada{#}Russia;Japan;Heaven;Murder.;Europe countries;Canada;Research and Analysis Wing;Pakistan;Hero;IndiaSat, 30 Sep 2023 09:22:00 GMTచెరపకు రా చెడేవు అనేది సామెత. భారత్ మీద బురద జల్లేందుకు యత్నిస్తున్న కెనడా ఇప్పుడు తాను చెడుతోంది. ఇప్పటికే భారత్, కెనడా సంబంధాలు ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.  దేశాభివృద్ధికి ఆటంకం సృష్టించే ఉగ్రవాదాన్ని అంతం చేయాలని  భారత్ ఓ వైపు పోరాడుతుంటే.. మన దేశానికి వ్యతిరేకంగా ఉండే ఖలీస్థానీ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని  ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.


ఖలీస్థానీ టైగర్ ఫోర్స్ కు చెందిన నిజ్జర్ హత్యతో మరొకరు హత్య గావించబడటం కెనడా తీవ్రవాదుల స్వర్గం అనే ప్రచారం ప్రపంచ దేశాలకు పాకింది. అయితే ఈ హత్యను భారత్ పై రుద్దాలని కెనడా చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐరాస సర్వ ప్రతినిధుల సమావేశాల నేపథ్యంలో ఇటీవల జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ గ్రూపునకు జపాన్ అధ్యక్షత వహిస్తోంది. నిజ్జర్ హత్య కేసులో ఖండించే అంశాన్ని చేర్చాలని కెనడా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.


మరోవైపు బెలూచ్ ప్రాంతానికి చెందిన పాకిస్థాన్ తీవ్రవాదులు కూడా కెనడాలోనే ఆశ్రయం పొందుతున్నారు అనడానికి సాక్ష్యం కరీబా బెలూచీని కెనడాలోనే చంపేయడం. దీనిపై పాకిస్థానీ మానవ హక్కుల వాళ్లు ఈ అంశంపై  ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రష్యా కెనడా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే నాజీ నియంత హిట్లర్ యూరప్ దేశాలపై(అమెరికా)తో  సహా దాడి చేశాడు.  ఆనాడు హిట్లర్ కు సంబంధించిన నాజీల బృందం లో సభ్యుడైన ఒకరికి కెనడాలో సన్మానం జరిగింది. ఎప్పుడూ లేనంతగా హిట్లర్ కు సంబంధించిన వాళ్లకి పిలిచి సన్మానం చేయడమే కాకుండా యుద్ధ హీరో అని కీర్తించింది.  


దీనిపై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కెనడాని నిలదీసింది. ఇలాంటి తప్పుడు పని ఎలా చేస్తారని ఆక్షేపించింది. దీనికి కెనడా క్షమాపణలు సైతం తెలిపింది. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాపం.. రూ.3 ఇవ్వలేదని.. రూ.25 వేల ఫైన్ పడింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>