MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసాయి ధరమ్ తేజ్ కలర్స్ స్వాతి కలిసి నటించిన సినిమాలు ఎక్కడ కనిపించవు. అయితే కలర్స్ స్వాతి లేటెస్ట్ గా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు తేజ్ అతిధిగా రావడంతో వీరిద్దరి మధ్య ఉన్న ఘాడమైన స్నేహం బయటపడటమే కాకుండా ఆ స్నేహానికి సంబంధించిన వార్తలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. కలర్స్ స్వాతిలు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.స్వాతి తేజ్ లు ఒకే స్కూల్ లో చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారట. అంతేకాదు తేజ్ ను స్వాతి ‘నువ్వు’ అంటూ చాల చనువుగా పలకరించి అందsaidharamtej{#}U Turn;Swati;swathi;School;News;media;Cinemaసాయిధ‌ర‌మ్ తేజ్ సీక్రెట్ ను బయటపెట్టిన కలర్స్ స్వాతి !సాయిధ‌ర‌మ్ తేజ్ సీక్రెట్ ను బయటపెట్టిన కలర్స్ స్వాతి !saidharamtej{#}U Turn;Swati;swathi;School;News;media;CinemaFri, 29 Sep 2023 15:34:57 GMT
సాయి ధరమ్ తేజ్ కలర్స్ స్వాతి కలిసి నటించిన సినిమాలు ఎక్కడ కనిపించవు. అయితే కలర్స్ స్వాతి లేటెస్ట్ గా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు తేజ్ అతిధిగా రావడంతో వీరిద్దరి మధ్య ఉన్న ఘాడమైన స్నేహం బయటపడటమే కాకుండా ఆ స్నేహానికి సంబంధించిన వార్తలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. కలర్స్ స్వాతిలు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.


స్వాతి తేజ్ లు ఒకే స్కూల్ లో చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారట. అంతేకాదు తేజ్ ను స్వాతి ‘నువ్వు’ అంటూ చాల చనువుగా పలకరించి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు చిన్నప్పడు పరీక్షలలో తాను వ్రాస్తున్న పరీక్ష పేపర్ చూసి తేజ్ పరీక్షలలో పాస్ అయిన విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు తాను ఆన్సర్ షీట్ చూపించినా తేజ్ సరిగ్గా కాపీ కొట్టడం కూడ చేయలేకపోయేవాడని ఆమె జోక్ చేసింది.


ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన తేజ్ లుక్ చూసిన వారు చాలమంది షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బ్రో’ మూవీ విడుదల తరువాత సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన తేజ్ ఈమధ్య ఎక్కడా మీడియా కంట పడలేదు. అయితే ఈ ఫంక్షన్ లో తేజ్ చాల లావుగా కనిపించడంతో ఆ బరువు తగ్గించుకోవడం కోసం తేజ్ ఇలా సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడా అన్న సందేహాలు రావడం సహజం.


పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయిన కలర్స్ స్వాతి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ సినిమాల వైపు వస్తోంది. వాస్తవానికి మంచి టాలెంటెడ్ యాక్టర్ గా ఆమెకు పేరు ఉన్నప్పటికీ ఆ పేరుకు తగ్గ స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ప్రారంభం అవుతున్న పరిస్థితులలో ఆమె లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’ ఎలాంటి రిజల్ట్ ను తీసుకు వస్తుందో చూడాలి..




ReplyForward




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో.. ఆయనను ఓడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>