Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/babaf71aceab2-2919-40c6-8a8f-190eb3bafdab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/babaf71aceab2-2919-40c6-8a8f-190eb3bafdab-415x250-IndiaHerald.jpgఅక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భాగంగా అటు భారత దాయాధి దేశమైన పాకిస్తాన్ కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఆసియా కప్ లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ జట్టును సొంత గడ్డపైనే దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి ఈ క్రమంలోనే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగేందుకు రెడీ అయింది. అయితే అధికారిక మ్యాచ్ లు ప్రారంభంBabaf{#}Varsham;Babur;Pakistan;Hyderabad;Indiaభారత గడ్డపై.. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన పాకిస్తాన్ ప్లేయర్లు?భారత గడ్డపై.. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన పాకిస్తాన్ ప్లేయర్లు?Babaf{#}Varsham;Babur;Pakistan;Hyderabad;IndiaFri, 29 Sep 2023 18:06:00 GMTఅక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భాగంగా అటు భారత దాయాధి దేశమైన పాకిస్తాన్ కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఆసియా కప్ లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ జట్టును సొంత గడ్డపైనే దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి  ఈ క్రమంలోనే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగేందుకు రెడీ అయింది. అయితే అధికారిక మ్యాచ్ లు ప్రారంభం కావడానికి ముందే పాకిస్తాన్ టీం వార్మ్ ఆఫ్ మ్యాచ్లు ఆడుతుంది అని చెప్పాలి.


 నేరుగా హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ జట్టు ఇక నేడు అటు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడింది  అయితే మొదటి వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరి దృష్టి ఉంది  అయితే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం మొదటి వార్మప్ మ్యాచ్ లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 84 బంటుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల  సహాయంతో 80 పరుగులు చేసి అదరగొట్టాడు  ఇక మిచల్ శాన్టర్ బౌలింగ్లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు  అయితే బాబర్ తో పాటు మరో కీలక ఆటగాడు అయినా మహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.



 ఇలా ఇద్దరు కీలక ప్లేయర్లు హాఫ్ సెంచరీ తో చెలరేగిపోవడంతో ఇక వార్మప్ మ్యాచ్ లోనే పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతూ ఉంది  అయితే మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు అన్నది తెలుస్తుంది. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా సజావుగా కొనసాగుతూ ఉంది   అయితే భారత్ వేదికగా ఇలా పాకిస్తాన్ ప్లేయర్లు చెలరేగి  పోవడంతో   ప్రపంచకప్ టోర్నిలో జరగబోయే దాయాదుల పోరు మరింత ఉత్కంఠంగా మారబోతుంది అని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో.. ఆయనను ఓడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>