Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8d3c72fc-a7e5-44f0-8044-16e5e591c141-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8d3c72fc-a7e5-44f0-8044-16e5e591c141-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ ప్రస్థానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టిటిపి పార్టీ ద్వారా రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత తెలంగాణ సాధన అనే ఒక నినాదంతో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి.. ఇక టిడిపి నుంచి వేరుపడ్డారు. అప్పటి నుంచి అలుపెరుగని వీరుడిలాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు పోరాటం చేశారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏకంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి చివరికి ప్రత్యేక రాష్ట్రం కలను సహకారం చేసుకున్నారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా మాత్రమేKcr{#}editor mohan;madan;Prasthanam;KCR;TDP;Telangana;Yevaru;Telangana Chief Minister;CM;Assembly;Party;Congressకెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో.. ఆయనను ఓడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే?కెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో.. ఆయనను ఓడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే?Kcr{#}editor mohan;madan;Prasthanam;KCR;TDP;Telangana;Yevaru;Telangana Chief Minister;CM;Assembly;Party;CongressFri, 29 Sep 2023 18:15:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ ప్రస్థానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టిటిపి పార్టీ ద్వారా రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత తెలంగాణ సాధన అనే ఒక నినాదంతో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి.. ఇక టిడిపి నుంచి వేరుపడ్డారు. అప్పటి నుంచి అలుపెరుగని  వీరుడిలాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు పోరాటం చేశారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏకంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి చివరికి ప్రత్యేక రాష్ట్రం కలను సహకారం చేసుకున్నారు.


 ఇక ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఎంపీగా కూడా పనిచేశారు అని చెప్పాలి. ఇక సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి అడిగితే ఆయన ఓటమి ఎరుగని గొప్ప రాజకీయ నాయకుడు అని చెబుతూ ఉంటారు. కానీ కెసిఆర్ ఒక వ్యక్తి చేతిలో ఓడిపోయాడు అన్న విషయం కాస్త ఆ టాపిక్ గా మారిపోయింది. కేసీఆర్ ని ఓడించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఒక వ్యక్తి ఓడించారు.


 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేయగా.  ఇక ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనంతుల మదన్మోహన్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలలో అనంతుల మదన్ మోహన్ కేసీఆర్ పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు  అయితే కెసిఆర్ కు ఇదే మొదటి ఓటమి అని చెప్పాలి. ఆ తర్వాత 13 సార్లు విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే.. ఐదుసార్లు ఎంపీగా గెలిచారు కెసిఆర్. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్.. ఇక 2004లో మరణించారు. అయితే మోహన్ ను కేసీఆర్కు గురువు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వివరణ ఇస్తూ ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో.. ఆయనను ఓడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>