Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru2c9e8f06-e134-4f90-aaa5-5bf1cc1386ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru2c9e8f06-e134-4f90-aaa5-5bf1cc1386ed-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి... పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నేడు యావత్ ఇండస్ట్రీకే వటవృక్షంలాగా మారారు. ఇక ఆయనని ఎంతోమందికి స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఒకానొక సమయంలో అగ్ర హీరోగా ఇండస్ట్రీని ఒక ఏలు యేలిన చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించే సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో చిరంజీవి సినిమాల పట్ల అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్తితి వుంది. ఈ కChiru{#}niharika konidela;Chiranjeevi;shankar;Success;kalyan;Chaitanya;House;Telugu;varun sandesh;varun tejఆ ఇల్లు వలనే చిరంజీవికి అన్ని ఇబ్బందులా?ఆ ఇల్లు వలనే చిరంజీవికి అన్ని ఇబ్బందులా?Chiru{#}niharika konidela;Chiranjeevi;shankar;Success;kalyan;Chaitanya;House;Telugu;varun sandesh;varun tejFri, 29 Sep 2023 15:15:00 GMTమెగాస్టార్ చిరంజీవి... పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నేడు యావత్ ఇండస్ట్రీకే వటవృక్షంలాగా మారారు. ఇక ఆయనని ఎంతోమందికి స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఒకానొక సమయంలో అగ్ర హీరోగా ఇండస్ట్రీని ఒక ఏలు యేలిన చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించే సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో చిరంజీవి సినిమాల పట్ల అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్తితి వుంది. ఈ క్రమంలో చిరంజీవి తన సినిమాల కారణంగా సోషల్ మీడియాలో కూడా భారీగా ట్రోలింగ్ కు గురవుతున్నారు.

చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం కావచ్చు, నిహారిక వెంకట చైతన్య విడాకులు కావచ్చు, వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం వంటి విషయాలు మెగా ఫ్యామిలీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి ఫ్యామిలీ ఈ విధంగా తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కోవడానికి కారణం ఒక ఇల్లే కారణం అంటూ పెద్ద ఎత్తున ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది. మొగల్తూరులో చిరంజీవి ఇల్లు అంటూ గత కొంతకాలంగా వార్తల్లో ప్రచారం ఉంది ఈ ఇంటిని లైబ్రరీ కోసం ఇస్తానని చెప్పిన చిరంజీవి ఇప్పుడు దానిని 3 లక్షలకు అమ్మేశారు అంటూ ఒక వార్త గతంలో వైరల్ గా మారిన సంగతి విదితమే.

ఇక సదరు ఇల్లు తనది కాదని, చిరంజీవి గారి అమ్మమ్మ ఊరు ఆ ఇంటిలో తాను పుట్టానే తప్ప ఆ ఇంటిపై నాకు ఎలాంటి హక్కు లేదని చిరంజీవి పలు సందర్భాలలో చెప్పినప్పటికీ జనాలు ఆ మాటలను నమ్మే పరిస్థితి కనబడడంలేదు. ఇక అక్కడి లైబ్రరీ ఏర్పాటుకు తన సొంత డబ్బును ఉపయోగించి ఒక బిల్డింగ్ కూడా కట్టించానని ఓ సందర్బంలో ఆయన చెప్పారు. అయినప్పటికీ కొందరు మాత్రం లైబ్రరీ కోసం ఇస్తానన్న ఇంటిని చిరంజీవి అమ్ముకున్న కారణంగానే ఇలా ఇబ్బందులు పడతారని ఆ ఇల్లు చిరంజీవి ఫ్యామిలీకి బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది అంటూ ఓ వార్తని వైరల్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో.. ఆయనను ఓడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>