DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababudfadcdfe-499b-4c23-9ef3-1899ef5b5ae9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababudfadcdfe-499b-4c23-9ef3-1899ef5b5ae9-415x250-IndiaHerald.jpgచంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరక్కుంటాడు అని ఎవరూ ఊహించలేదు. అరెస్టయినా వెంటనే బెయిల్ పై బయటకి వస్తారు. అంతేకానీ ఇన్ని రోజులు జైలులోఉంటారు అని కూడా భావించి ఉండరు. ఇప్పడు ఇదే సమయంలో వరుసగా వివిధ రకాల కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టేయగా చంద్రబాబు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. చాలా మంది నిపుణులు సూచిస్తుంది ఏంటంటే.. అక్కడ ఒకవేళ క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తే బెయిల్ కూడా ఇప్పట్లో రాదు అని. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ నchandrababu{#}Switzerland;contract;CBN;local language;High court;Capital;court;Government;Singaporeబాబు కష్టాల్‌: స్కిల్‌ స్కామ్‌ తాత.. అమరావతి?బాబు కష్టాల్‌: స్కిల్‌ స్కామ్‌ తాత.. అమరావతి?chandrababu{#}Switzerland;contract;CBN;local language;High court;Capital;court;Government;SingaporeFri, 29 Sep 2023 04:00:00 GMTచంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరక్కుంటాడు అని ఎవరూ ఊహించలేదు. అరెస్టయినా వెంటనే బెయిల్ పై బయటకి వస్తారు. అంతేకానీ ఇన్ని రోజులు జైలులోఉంటారు అని కూడా భావించి ఉండరు.  ఇప్పడు ఇదే సమయంలో వరుసగా వివిధ రకాల కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టేయగా చంద్రబాబు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. చాలా మంది నిపుణులు సూచిస్తుంది ఏంటంటే.. అక్కడ ఒకవేళ క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తే బెయిల్ కూడా ఇప్పట్లో రాదు అని.


ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టివేస్తే ఆధారాలు ఉన్నాయని నమ్మినట్లు. ఆ సందర్భంలో స్థానిక కోర్టులు బెయిల్ మంజూరు చేయడానికి ఆలోచిస్తాయి. ఆ సమయంలో బెయిల్ కోసం మళ్లీ సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి ఆర్థిక పర అంశాల్లో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి సంశయిస్తుంది. ప్రాథమిక ఆధారాలు లేకుంటే తప్ప బెయిల్ ఇవ్వదు.


ఇప్పటికే చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ లో రెండు పీటీ వారెంట్లు జారీ చేశారు.  ఇప్పుడు అమరావతికి సంబంధించిన ఇంతకుముందు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న స్టేలు, 41.ఏ నోటీసుల్లో విచారణలో ఉన్న వాటి అన్నింటల్లో అరెస్టు చేస్తారా అనేది వేచి చూడాలి. రాజధాని ప్రాంతం స్టార్టప్ అభివృద్ధి పేరుతో భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలకు ప్రభుత్వం తెరతీసింది. సింగపూర్ కంపెనీల కోసం చట్టాలను సవరించింది. పాత జీవోను సవరిస్తూ మరో జీవోను జారీ చేసింది.


అసెండాస్, సెంబ్రిడ్జ్, సెంస్కార్బ్  కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి స్విస్ ఛాలెంజ్లో పాల్గొన్నాయి. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీసుకున్న 1091 ఎకరాలను వీరికి అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్తకంపెనీలతో ఒప్పందం ఎలా చేసుకుంటారని జీవో 179 కి ఇది విరుద్ధమని అప్పట్లో సాక్షిలో ఈ వార్త ప్రచురితం అయింది. ఇప్పుడు దానిపై కూడా దర్యాప్తు జరుగుతుంది అనేది కీలకాంశం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన యాంకర్ మంజూష..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>