EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf8a06d37-db70-4050-a442-73f911e121ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf8a06d37-db70-4050-a442-73f911e121ae-415x250-IndiaHerald.jpgచంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ నాయకులు అనేక ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమందికి రూ. 150 ఇచ్చి మరీ నిరసన కార్యక్రమాలకు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మంచి ఊపు మీద ఉన్న సమయంలో అరెస్టు చేయడం వల్ల ఇప్పుడు నిరసన కార్యక్రమాలతోనే టీడీపీ నాయకులు సరిపెడుతున్నారు. అయితే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలనుకుంటున్న సమయంలో సీఎం జగన్ టీడీపీని చంద్రబాబును కొట్టిన దెబ్బతో టీడీపీ నాయకులు ఏం చేయాలో తోచని పరిస్థితికి వెళ్లిపోయారు. అంటే టీడీపీ నాయకులు చంద్రJAGAN{#}TDP;Jagan;CBN;Party;Bharatiya Janata Party;CMజగన్‌ దెబ్బకు.. టీడీపీ కకావికలం?జగన్‌ దెబ్బకు.. టీడీపీ కకావికలం?JAGAN{#}TDP;Jagan;CBN;Party;Bharatiya Janata Party;CMThu, 28 Sep 2023 07:00:00 GMTచంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ నాయకులు అనేక ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమందికి రూ. 150 ఇచ్చి మరీ నిరసన కార్యక్రమాలకు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మంచి ఊపు మీద ఉన్న సమయంలో అరెస్టు చేయడం వల్ల ఇప్పుడు నిరసన కార్యక్రమాలతోనే టీడీపీ నాయకులు సరిపెడుతున్నారు. అయితే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలనుకుంటున్న సమయంలో సీఎం జగన్ టీడీపీని చంద్రబాబును కొట్టిన దెబ్బతో టీడీపీ నాయకులు  ఏం చేయాలో తోచని పరిస్థితికి వెళ్లిపోయారు.


అంటే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఇంటింటికీ గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సభలు, సమావేశాలను పెట్టి ప్రజల్లోకి వెళ్లి జగన్ సర్కారు అవలంభిస్తున్నప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజల్లోకి  తీసుకెళుతున్న సమయంలో ఆయన అరెస్టయ్యారు. అయితే టీడీపీ నాయకులకు మాత్రం చంద్రబాబు ను ఎలాగైన అరెస్టు నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలోనే మునిగిపోయారు.


చంద్రబాబు అరెస్టు ను ఖండిస్తూ ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు నిరసనలు, ధర్నాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలను మరిచిపోతున్నారు. కేవలం జగన్ బాబును అరెస్టు చేసి అన్యాయం చేశారని చెబుతూ అసలు లక్ష్యాన్ని మరిచిపోతున్నారు. అయితే చంద్రబాబు అనుకున్న లక్ష్యం గడప గడపకు టీడీపీ వెళ్లి ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.


అయితే చంద్రబాబు ఇప్పట్లో విడుదల కాకపోతే టీడీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి టీడీపీ నేతలు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలను కలవడానికి వెళుతున్నారు. ఇలా చంద్రబాబు బెయిల్ కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారు. కాబట్టి వైఎస్ జగన్ కొట్టిన దెబ్బ టీడీపీ నాయకులకు గట్టిగానే తగిలిందని అనుకోవచ్చు. మరి కొన్ని రోజులు పార్టీకి అస్తవ్యస్థ పరిస్థితి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>