MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘ఖుషీ’ మూవీ పై విజయ్ దేవరకొండ పెట్టున్న ఆశలు నెరవేరకపోవడంతో ఇప్పుడు అతడి ఆశలు అన్నీ సంక్రాంతి రేస్ లో విడుదలకాబోతున్న పరుశు రామ్ మూవీ పై ఉన్నాయి. తనకు గతంలో ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన పరుశు రామ్ తో మళ్ళీ ఆ హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో విజయ్ చాల ధైర్యంతో సంక్రాంతికి రాబోతున్న ‘గుంటూరు కారం’ ‘ఈగల్’ ‘హనుమాన్’ సినిమాల మధ్య తన సినిమాను ధైర్యంగా పోటీకి తీసుకు వస్తూ తన మూవీకి ఫ్యామిలీ స్టార్ అన్న టైటిల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాల వేగంగా షూటింగ్VIJAYADEVARAKONDA{#}sukumar;Dil;vijay deverakonda;Joseph Vijay;Comedy;Makar Sakranti;Industry;ram pothineni;Telugu;News;Cinemaవ్యూహాలు మారుస్తున్న ఫ్యామిలీ స్టార్ !వ్యూహాలు మారుస్తున్న ఫ్యామిలీ స్టార్ !VIJAYADEVARAKONDA{#}sukumar;Dil;vijay deverakonda;Joseph Vijay;Comedy;Makar Sakranti;Industry;ram pothineni;Telugu;News;CinemaThu, 28 Sep 2023 13:37:42 GMT‘ఖుషీ’ మూవీ పై విజయ్ దేవరకొండ పెట్టున్న ఆశలు నెరవేరకపోవడంతో ఇప్పుడు అతడి ఆశలు అన్నీ సంక్రాంతి రేస్ లో విడుదలకాబోతున్న పరుశు రామ్ మూవీ పై ఉన్నాయి. తనకు గతంలో ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన పరుశు రామ్ తో మళ్ళీ ఆ హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో విజయ్ చాల ధైర్యంతో సంక్రాంతికి రాబోతున్న ‘గుంటూరు కారం’ ‘ఈగల్’ ‘హనుమాన్’ సినిమాల మధ్య తన సినిమాను ధైర్యంగా పోటీకి తీసుకు వస్తూ తన మూవీకి ఫ్యామిలీ స్టార్ అన్న టైటిల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  


ప్రస్తుతం చాల వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని లీకులు వస్తున్నాయి. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈమూవీ ఎట్టి పరిస్థితులలోను తనకు సూపర్ హిట్ ఇచ్చి తీరుతుంది అన్న అంచనాలు విజయ్ కు ఉన్నట్లు తెలుస్తోంది.


‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ మొట్టమొదటిసారిగా విజయ్ తో ఈమూవీలో నటిస్తోంది. ఇది ఇలాఉండగా ‘లైగర్’ ఫ్లాప్ ఆతరువాత వచ్చిన ‘ఖుషీ’ ఏవరేజ్ సక్సస్ విజయ్ దేవరకొండ ఆలోచనలలో చాల మార్పులు తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రాకారం విజయ్ దేవరకొండ పరుశు రామ్ సినిమాను ఒక వైపు పూర్తి చేస్తూ ఏకంగా 6 కొత్త సినిమాలకు విజయ్ లైన్ క్లియర్ చేసినట్లుగా వస్తున్న వార్తలు విని చాలమంది ఆశ్చర్య పోతున్నారు.


మైత్రీ మూవీస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే మూవీతో పాటు అనేక ప్రముఖ నిర్మాణ సంస్థల సినిమాలు ఈ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప 2’ విడుదల తరువాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అని వస్తున్న వార్తలు నిజం అయితే రానున్న రోజులలో విజయ్ టాప్ హీరోల లిస్టులో చేరడం ఖాయం అని అనిపిస్తోంది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>