EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane7c4b958-ef5e-44e1-afdf-7eafe1635a71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane7c4b958-ef5e-44e1-afdf-7eafe1635a71-415x250-IndiaHerald.jpgచేతులు కాలాక ఆకులు పట్టుకోవడం జగన్ సర్కారుకు అలవాటపోయింది. ఇంటిలిజెన్స్ డిపార్టుమెంట్ విభాగంలో వైసీపీ సర్కారు విఫలం అవుతుంది. ఎన్ఐఏ కు సంబంధించిన నిఘా విభాగం పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి గంజాయి, డ్రగ్స్ ఎవరూ సప్లై చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారనే దానిపై ఎన్ఐఎ పోలీసుల వచ్చి చూసే దాకా ఇక్కడి ఇంటిలిజెన్స్ కు తెలియకపోవడం దారుణమని అంటున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి మాటలను ఉటంకిస్తూ ఇటీవల ఈనాడు ప్రత్యేక కథనం రాసుకొచ్చింది. మద్యం మరణ శాసనం అనే కథనంతో రాసిన విశ్లేషణ వార్త ఇప్పుడJAGAN{#}Daggubati Purandeswari;Kathanam;eenadu;Drugs;Jagan;YCP;Party;Bharatiya Janata Party;policeమత్తు రాజకీయం.. జగన్ ఇకనైనా మేలుకుంటాడా?మత్తు రాజకీయం.. జగన్ ఇకనైనా మేలుకుంటాడా?JAGAN{#}Daggubati Purandeswari;Kathanam;eenadu;Drugs;Jagan;YCP;Party;Bharatiya Janata Party;policeThu, 28 Sep 2023 05:00:00 GMTచేతులు కాలాక ఆకులు పట్టుకోవడం జగన్ సర్కారుకు అలవాటపోయింది. ఇంటిలిజెన్స్ డిపార్టుమెంట్ విభాగంలో వైసీపీ సర్కారు విఫలం అవుతుంది. ఎన్ఐఏ కు సంబంధించిన నిఘా విభాగం పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి గంజాయి, డ్రగ్స్ ఎవరూ సప్లై చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారనే దానిపై ఎన్ఐఎ పోలీసుల వచ్చి చూసే దాకా ఇక్కడి ఇంటిలిజెన్స్ కు తెలియకపోవడం దారుణమని అంటున్నారు.


బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి మాటలను ఉటంకిస్తూ ఇటీవల ఈనాడు ప్రత్యేక కథనం రాసుకొచ్చింది. మద్యం మరణ శాసనం అనే కథనంతో రాసిన విశ్లేషణ వార్త ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ తన మాట నిలబెట్టుకోకపోగా తిరిగి ఇష్టమున్న బ్రాండ్లను అమ్మడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.


మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనుకునే సమయంలో ఎక్కువ రేట్లు పెట్టాలని, అసలైన బ్రాండ్లు కాకుండా ఇతర వేరే రకాల బ్రాండ్లను ప్రవేశపెట్టడం వల్ల తాగేవారికి అది అంతగా రుచించకపోవడం వల్ల మందు మానేస్తారనే కాన్సెప్ట్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సూచనలు పని చేస్తాయా? దీనిపై మందు బాబులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రేట్లు ఎక్కువ చేయడం వల్ల తాగే వారి నుంచి వైసీపీకి వ్యతిరేకత వచ్చేలా చేయడం.. అదే సమయంలో వైసీపీ సర్కారు ఇష్టారీతిన మందులు అమ్మడం, అవి కూడా నాసిరకమైన బ్రాండ్ల వల్ల తాగిన వారి ఆరోగ్యం పాడైపోతుందని ప్రచారం చేయడం.. దీంతో అటు మందుబాబుల ఓట్లు.. అటు వారి మహిళల ఓట్లు కూడా టీడీపీకి పడేలా ప్లాన్ చేస్తున్నారు.


కానీ తాము అధికారంలోకి మద్యపాన నిషేధం చేస్తామని ఎవరూ చెప్పడం లేదు. మంచి బ్రాండ్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇలాంటి హామీలను అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీ కూడా ఇంతకు ముందు ఇలా చెప్పలేదు. మరి ప్రజలకు ఇస్తున్న హామీలను చూసి వారే ఆశ్చర్యపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : ఉండవల్లిపై మొదలైపోయిందిగా




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>