EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp4e01a327-5428-4275-86f0-f4f294f90e6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp4e01a327-5428-4275-86f0-f4f294f90e6b-415x250-IndiaHerald.jpgచంద్రబాబు కేసు, అరెస్టు విషయంలో అసలు ఆయన తప్పు చేశారా లేదా అన్నది ప్రజలకు తెలియజెప్పడానికి ఒక వేదిక కావాలి. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొన్నటి వరకు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైంలో బాయ్ కాట్ నినాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కి సంబంధించిన కేసులపై రోజుకు చర్చను లేవనెత్తడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒకరోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి, మరొక రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు TDP{#}vedhika;Y. S. Rajasekhara Reddy;Assembly;Sakshi;Party;CBN;Telugu Desam Partyఅసెంబ్లీ బహిష్కరణ..టీడీపీ తప్పు చేసిందా?అసెంబ్లీ బహిష్కరణ..టీడీపీ తప్పు చేసిందా?TDP{#}vedhika;Y. S. Rajasekhara Reddy;Assembly;Sakshi;Party;CBN;Telugu Desam PartyTue, 26 Sep 2023 00:00:00 GMTచంద్రబాబు  కేసు, అరెస్టు విషయంలో అసలు ఆయన తప్పు చేశారా లేదా అన్నది ప్రజలకు తెలియజెప్పడానికి ఒక వేదిక కావాలి. అయితే చంద్రబాబు  అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు  మొన్నటి వరకు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైంలో బాయ్ కాట్ నినాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కి సంబంధించిన కేసులపై రోజుకు చర్చను లేవనెత్తడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.


ఒకరోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి, మరొక రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి, మరొక రోజు ఫైబర్ గ్రిడ్ కేసు గురించి ఇలా రోజుకో కేసుపై మాట్లాడాలని ఫిక్స్ అయిపోయారు. కానీ కరెక్ట్ గా ఇదే టైం కి తెలుగు దేశం పార్టీ శ్రేణులు అసెంబ్లీకి బాయ్ కాట్ అని ప్రకటించేసరికి అసలు గొడవ మొదలైంది. తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన మీడియాలలో చంద్రబాబుకు అనుకూలంగానే కథనాలు వెలువడతాయి.


సాక్షి మీడియా అయితే చంద్రబాబు నాయుడుని బూతులు తిడుతూ చెప్పుకొస్తుంది. ఇలా ఎవరికి అనుకూలమైన మీడియాలో వాళ్ళకు సంబందించిన చర్చలే జరుగుతూ ఉంటాయి. ఈ రెండు పద్ధతులు కాకుండా తటస్థంగా  మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పుకు వచ్చే పద్ధతి ఉండాలి. ఇలా తటస్థ  భావాలను ప్రకటించేందుకు, ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా ఒక వేదిక ఉండాలి. అసెంబ్లీలో అయితే తటస్థ భావాలకు తగ్గట్టుగా పరిస్థితి ఉంటుంది.


కానీ తెలుగు దేశం పార్టీ శ్రేణులు తాము అసెంబ్లీకి రామని చెప్పడం జరిగింది. ఇద్దరు తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వర్గాల వారు, అలాగే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలవారు ఒకచోట కూర్చుని పరస్పరం చర్చించుకుంటేనే అసలు విషయాలు సామాన్య జనానికి తెలియడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ పరిస్థితి అటు పేపర్ల లోనూ లేదు. ఇటు మీడియాలో కూడా లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాయలసీమ : పవన్ పోటీచేసేది ఇక్కడేనా ​?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>