Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava3bec6a45-a8f3-435f-8e5e-b799dc58d5df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava3bec6a45-a8f3-435f-8e5e-b799dc58d5df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వల్ సినిమాల హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తూ ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇది అలాంటి ఇలాంటి సీక్వెల్ కాదు. అందరికీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఏకంగా 17 ఏళ్ల తర్వాత ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తూ ఉంది. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేRaghava{#}Chiranjeevi;Kangana Ranaut;Akkineni Nagarjuna;jyothika;raghava lawrence;bollywood;Rajani kanth;Hindi;Chandramukhi;India;Audience;Hero;Event;Cinema;september;Teluguఆ ముగ్గురు హీరోలు లేకుంటే.. నేను లేను : రాఘవ లారెన్స్ఆ ముగ్గురు హీరోలు లేకుంటే.. నేను లేను : రాఘవ లారెన్స్Raghava{#}Chiranjeevi;Kangana Ranaut;Akkineni Nagarjuna;jyothika;raghava lawrence;bollywood;Rajani kanth;Hindi;Chandramukhi;India;Audience;Hero;Event;Cinema;september;TeluguTue, 26 Sep 2023 08:40:00 GMTప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వల్ సినిమాల హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తూ ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇది అలాంటి ఇలాంటి సీక్వెల్ కాదు. అందరికీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఏకంగా 17 ఏళ్ల తర్వాత ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తూ ఉంది. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటించి ప్రేక్షకులు అందరినీ కూడా భయపెట్టింది. అయితే ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వల్ రాబోతుంది. హీరోగా లారెన్స్ నటించగా.. హీరోయిన్గా  బాలీవుడ్ బ్యూటీ కంగనా కనిపించబోతుంది. లేక ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 28వ తేదీన చంద్రముఖి 2 విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ప్రస్తుతం చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి.


 అయితే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా హీరో రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెబల్ తర్వాత నాకు డైరెక్షన్ చేసే టైం కుదరలేదు. ఇప్పుడు చంద్రముఖి 2తో మీ ముందుకు వస్తున్నాను. నేనెప్పుడూ దేవున్ని చూడలేదు. కానీ ప్రేక్షకులే దేవుళ్ళని అనుకుంటాను అంటూ లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇక నా లైఫ్ లో నేను ముగ్గురిని మర్చిపోను. రజనీకాంత్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాన్ని కాదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మీ అందరి అభిమానం నాకు దక్కేది కాదు. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన నాగార్జున గారు కూడా నా కెరియర్ నిలబెట్టారు అంటూ రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మన్మధుడు నాగార్జున.. ఆ హీరోయిన్ ను చూసి భయపడ్డాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>