Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea1071146-fc8b-4d89-9d56-80d669bd3cb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea1071146-fc8b-4d89-9d56-80d669bd3cb4-415x250-IndiaHerald.jpg7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.అలాగే సెల్వరాఘవన్ టేకింగ్‌పై socialstars lifestyle{#}sonia agarwal;Sangeetha;shankar;Darsakudu;Director;Hero;Cinema;Tamilరీ రిలీజ్ లో మెప్పిస్తున్న మూవీ...!!రీ రిలీజ్ లో మెప్పిస్తున్న మూవీ...!!socialstars lifestyle{#}sonia agarwal;Sangeetha;shankar;Darsakudu;Director;Hero;Cinema;TamilTue, 26 Sep 2023 22:06:00 GMT7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా లో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.అలాగే సెల్వరాఘవన్ టేకింగ్‌పై ప్రశంసలు కూడా దక్కాయి. యూత్ ఆడియెన్స్‌ను ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా సేమ్ టైటిల్‌ తో రిలీజైంది. ఈ కల్ట్ క్లాసిక్ మూవీ సెప్టెంబర్ 22 న ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది.రీ రిలీజ్‌లో కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది.. మూడు రోజుల్లోనే ఈ సినిమా  భారీగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.మూడో రోజు కూడా ఈ ప్రేమకథా చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి.ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడం 7/G బృందావన కాలనీకి కలిసి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజైన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా తొలిరోజే కోటికిపైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు అరవై లక్షలు, మూడో రోజు యాభై లక్షల వరకు వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో రీ రిలీజైన తమిళ డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న మూవీస్‌లో ఒకటిగా 7/G బృందావన కాలనీ నిలిచింది.త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో హీరో రవికృష్ణ పేర్కొన్నాడు. సోనియా అగర్వాల్ మినహా మిగిలిన ప్రధాన పాత్రధారులందరూ ఈ సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లుతెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ రోజు టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>