EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuib06ec64f-3065-43a8-a911-e69822c7f5d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuib06ec64f-3065-43a8-a911-e69822c7f5d7-415x250-IndiaHerald.jpgటీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును విచారించేందుకు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో మరో ఇద్దరు కీలక వ్యక్తులు పాత్ర ఉన్నట్లు సీఐడీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వీరు విచారణకు వస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఎవరా ఇద్దరూ అంటే పీఏ శ్రీనివాస్, మనోజ్. కేసుకు సంబంధించిన డబ్బులకు వీరిద్దరే కీలకం అనchandrababui{#}srinivas;Kurasala Kannababu;TDP;Anti-Corruption Bureau;Rajahmundry;YCP;Assembly;Minister;Yevaru;media;CBNచంద్రబాబు కేసులో.. ఆ ఇద్దరి విచారణే కీలకం?చంద్రబాబు కేసులో.. ఆ ఇద్దరి విచారణే కీలకం?chandrababui{#}srinivas;Kurasala Kannababu;TDP;Anti-Corruption Bureau;Rajahmundry;YCP;Assembly;Minister;Yevaru;media;CBNTue, 26 Sep 2023 06:00:00 GMTటీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును విచారించేందుకు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో మరో ఇద్దరు కీలక వ్యక్తులు పాత్ర ఉన్నట్లు సీఐడీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వీరు విచారణకు వస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు.


ఎవరా ఇద్దరూ అంటే పీఏ  శ్రీనివాస్, మనోజ్. కేసుకు సంబంధించిన డబ్బులకు వీరిద్దరే కీలకం అని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఎవరు ప్రశ్నించినా  వీరి పాత్ర చర్చకు రావడం ఖాయం. మనోజ్ డబ్బులు తీసుకువచ్చి పెండ్యాల శ్రీనివాస్ కు డబ్బులు ఇస్తారు. అతను చంద్రబాబు కు చేరవస్తారు అనేది ఆరోపణ. గతంలో దొరికిన డబ్బులు,  డైరీ లే ఇందుకు నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు. కేవలం రెండున్నర లక్షల రూపాయలే దొరికాయని టీడీపీ నేతలు చెబుతుండగా.. రూ.85 లక్షలు దొరికాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఈ నేపథ్యంలో వాళ్ల ఇద్దరి దగ్గర కూడా స్టేట్మెంట్  తీసుకోవాలి.  కానీ వీరు అమెరికాలో ఉన్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ నేతలే శ్రీనివాస్ కు, మనోజ్ కు విమానానికి డబ్బులు ఇచ్చి అమెరికాకు పంపించారు. మా దగ్గర ఆధారాలు  ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటుగా వీళ్లను విచారించే  అవకాశం ఉంది. కేసు కొట్టి వేస్తే ఏ సమస్యా ఉండదు.  


శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి.  అతను కచ్ఛితంగా ప్రభుత్వ అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్లాలి. కానీ తీసుకోలేదు. కాబట్టి ఇతనిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ఇలా చేస్తే ఇదే సాక్ష్యం అవుతుంది. వీరు తప్పు చేసినట్లు ప్రజలు భావిస్తారు.  అదే వీళ్లిద్దరని మీడియా ముందు ప్రవేశపెడితే ఏ సమస్య ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మన్మధుడు నాగార్జున.. ఆ హీరోయిన్ ను చూసి భయపడ్డాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>