MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/2023-telugu-movies46fc8933-2341-43b3-b3b8-eb22b4a9682d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/2023-telugu-movies46fc8933-2341-43b3-b3b8-eb22b4a9682d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఈ ఏడాది అనుకోని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు బోల్తా పడుతూ ఉండగా చిన్న హీరోల చిత్రాలు సక్సెస్ అందుకుంటున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాలు విడుదలై టాప్-10 కలెక్షన్ పరంగా నిలిచిన చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ చిత్రం రూ.390 కోట్ల రూపాయలు సంపాదించి.. ఈ ఏడాది మొదటి స్థానాన్ని అందుకుంది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 230 కోట్ల ర2023 TELUGU;MOVIES{#}Chiranjeevi;Balakrishna;Anushka;dhanush;kalyan;kushi;vijay deverakonda;Dussehra;Kushi;AdiNarayanaReddy;Tollywood;Vijayadashami;Manam;Mister;Chitram;Director;India;Nani;Prabhas;Success;Cinema;1182023 : టాలీవుడ్ టాప్-10 చిత్రాలు ఇవే..!!2023 : టాలీవుడ్ టాప్-10 చిత్రాలు ఇవే..!!2023 TELUGU;MOVIES{#}Chiranjeevi;Balakrishna;Anushka;dhanush;kalyan;kushi;vijay deverakonda;Dussehra;Kushi;AdiNarayanaReddy;Tollywood;Vijayadashami;Manam;Mister;Chitram;Director;India;Nani;Prabhas;Success;Cinema;118Mon, 25 Sep 2023 07:30:00 GMTటాలీవుడ్ లో ఈ ఏడాది అనుకోని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు బోల్తా పడుతూ ఉండగా చిన్న హీరోల చిత్రాలు సక్సెస్ అందుకుంటున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాలు విడుదలై టాప్-10 కలెక్షన్ పరంగా నిలిచిన చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ చిత్రం రూ.390 కోట్ల రూపాయలు సంపాదించి.. ఈ ఏడాది మొదటి స్థానాన్ని అందుకుంది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 230 కోట్ల రూపాయలు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా 127 కోట్ల రూపాయలను కొల్లగొట్టి మూడవ స్థానంలో నిలిచింది. ధనుష్ నటించిన ధనుష్ చిత్రం సార్ మూవీ 118 కోట్లు కొల్లగొట్టింది. నాని నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా కూడా 116 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.


పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన బ్రో మూవీ 115 కోట్ల రూపాయలను రాబట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ చాలా ఏళ్ల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన విరూపాక్ష సినిమా 90 కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టింది. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టిన బేబీ సినిమా కూడా 85 కోట్ల రూపాయలను రాబట్టినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చాలా సంవత్సరాల తర్వాత ఖుషి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమా 78 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి చాలా ఏళ్ల తర్వాత నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్బులో చేరినట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది టాప్-10 చిత్రాలలో ఇవన్నీ నిలిచాయి. మరి రాబోయే మరిన్ని చిత్రాలలో ఏ రికార్డులను చెరిపేస్తాయో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన దివ్య భారతి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>